EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

బీసీలపై అగ్రకులాల దాడులు ఆపకపోతే తిరుగుబాటు తప్పదు

హైదరాబాద్ ఫిబ్రవరి 25 ఈతరం భారతం:

రోజురోజు కి రాష్ట్రంలో బీసీలపై అగ్ర కులాల దాడులు దౌర్జన్యాలు పెరిగాయని వీటిని అరికట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవాలని లేకపోతే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుందని జాతీయ బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు.నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో మల్లన్న జాతర సందర్భంగా అగ్రకులాల దాడులలో రెండు నెలల పసిపాప మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్న నేపథ్యంలో, బాధిత కుటుంబానికి తక్షణ న్యాయం చేయాలని కోరుతూ బీసీ ఉద్యమ నేత ఆర్. కృష్ణయ్య జిల్లాలో నిన్న పర్యటించారు. ఈసందర్బంగా నాగర్ కర్నూల్ లో బాధితులు జరుపుతున్న దీక్షను 14 బి.సి సంఘాల నాయకులూ 200 మంది నాయకులూ కార్యకర్తలు 40 కార్లలో వెళ్ళి బాధితులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై తక్షణమే నిష్పాక్షిక, వేగవంతమైన దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.ఈ దారుణమైన క్రూరమైన సంఘటన చుస్తే గతంలో కారంచేడు, చుండూరు, నీరుకొండ దుర్ఘటనలు గుర్తుకొస్తున్నాయన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ పెద్ద ఎత్తున ఏకమై ఉద్యమించే ఎదురు తిరిగే సమయం ఆసన్నమైందని హెచ్చరించారు.ఈ నేపథ్యంలో నిన్న ఆర్. కృష్ణయ్య మరియు బి.సి సంఘ నాయకులూ స్వయంగా నాగర్కర్నూల్కు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యుల వేదనను తెలుసుకుని సంఘీభావం ప్రకటించిన వారు “చిన్నారి ప్రాణం కోల్పోయిన ఈ విషాదాన్ని సాధారణ ఘటనగా చూడరాదు. ఇది రాక్షస చర్య ఇది సమాజ మనస్సాక్షిని కదిలించిన సంఘటన” అని విమర్శించారు.ఈ ప్రతినిధి వర్గంలో ర్యాగ అరుణ్ కుమార్, నీలం వెంకటేష్, జిల్లపల్లి అంజి, సతీష్, రాందేవ్, భీం రాజు, శివ కుమార్ యాదవ్, అంజి గౌడ్ తదితర నాయకులూ పాల్గొన్నారు.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top