EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కొత్తగూడెం జిల్లా కలెక్టర్ బదిలీ.. నూతన కలెక్టర్‌గా అంకిత్

ఈతరం భారతం హైదరాబాద్ ఫిబ్రవరి 26:

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలో పనిచేస్తున్న కలెక్టర్లను ప్రభుత్వ ఆదేశాల మేరకు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా గత రెండు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న జీతేశ్ వి.పాటిల్‌ను బదిలీ చేసి ఆయన స్థానంలో నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పని చేస్తున్న 2019 ఐఏఎస్ కేడర్‌కు చెందిన అంకిత్‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా నియమించింది. జితేష్ వి పాటిల్‌ను తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ కు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది.

Related News

Select the Topic
Scroll to Top