EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

వెలుగు మట్ల పేదల గృహాలు కూల్చివేత దుర్మార్గమైన చర్య        టిఆర్ఎస్(డి) పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నరాలసత్యనారాయణ ఆగ్రహం

ఈతరం భారతం హైదరాబాద్ ఫిబ్రవరి 28

వెలుగు మట్ల పేదల గృహాలు కూల్చివేత దుర్మార్గమైన చర్య అని టిఆర్ఎస్(డి) పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నరాలసత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేసారు.పేదలు ఇండ్లస్థలాలకు ఆక్రమించిన భూమి 272 కోట్లురూపాయలు అవుతుంది. అని చెప్తున్నారు.ప్రభుత్వంకు మేలుచేయడానికే ఈచర్య అంటున్నారు.అసలు అదికారులు దృష్టిలో ప్రభుత్వం అంటే ఎవరు?ప్రజలు కాదా? అని ప్రశ్నించారు.గాలిఅంచనాలు వేయడానికి మీరు అధికారులా? రియల్ ఎస్టేట్ బ్రోకర్లా? అసలు ఈ అంచనాకు మీ ప్రాతిపదిక ఏమిటి ?ప్రకటించాలని డిమాండ్ చేసారు.31ఎకరాలకు 272కోట్లు భూమి విలువ ఏ ప్రాతిపదికన నిర్థారించారు.ఒకవేళ పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూమి విలువ పెరిగితే ఇలాగే కూలగొట్టి ప్రభుత్వం స్వాధీనం చేస్తారా?ఒకవేళ మీరు నిర్ధారించిన భూమి విలువ నిజమే అయితే ఇటీవలనే గదా కలెక్టర్ కార్యాలయం కొరకు భూమి సేకరించారు.వారందరికీ అదే న్యాయం కలిగించాలి కదా? 1969 ప్రాంతంలో వినోబావేకు 306ఎకరాలు భూదాన్ ఉద్యమం భూమి ఓభూస్వామి దానంగా ఇచ్చారు.అయితే ఈ31ఎకరాల భూమి మినహాయిస్తే మిగతా275ఎకరాల భూమి ఏమైంది?దాన్ని స్వాధీనం చేసుకోవాల్సిన బాధ్యత మీమీద లేదా?ఎవడికి వారు భూదానోద్యమం భూమి ఒకసారి దొంగ రిజిస్ట్రేషన్ లు చేసుకొని మీ కళ్ళముందే ఎకరాలకెకరాలు పెన్సింగ్ లు చేసుకుంటుంటే,ప్లాట్లుచేసి అమ్ముకుంటుంటే ఏమిచేస్తున్నారని ప్రస్నిన్చేరు.మీరుతీసుకున్నచర్యలు ప్రకటించండి.పేదలవి కూలగొడతారు.వారిజోలికి వెళ్ళే దమ్ము దైర్యం మీకు లేదా?మిగతా 275ఎకరాలు ప్రభుత్వ స్వాధీనం చేస్తేమీరుచెప్పిన ప్రకారం 2700కోట్లఆదాయం వస్తుంది కదా?వాటిని ఎందుకు ముట్టుకోరు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి పేదల తరపున కొట్లాడుతున్న ప్రతినిధుల పై అక్రమ కేసులు పెట్టి వేధించడం నిజంకాదా?వారు ప్రజలకు దైర్యం ఇవ్వకుండా జైలుపాలు చేయడం కుట్రకాదా?గత పదేళ్ళుగా మీరు కరెంట్ ఇవ్వకపోయినా,నీళ్ళు ఇవ్వకపోయినా వారు వేసుకున్న చందాలతోటే వాటి నిర్వాహణ చేసుకున్న నిర్వాహకులు పై చీటింగ్ కేసులు పెట్టడం ఎవరి ప్రయోజనాలకోసం. దుర్మార్గమైన చర్యను సమర్థించుకోవడానికి వాళ్ళపై దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారన్నారు.ఈదుశ్చర్యలో బాగం అయిన మంత్రులు,రియాల్టర్ వ్యాపారులను రక్షించడానికి కాదా? ఒక్కరోజు అదికారులు స్నానం చేయకుండా , కరెంట్ దీపం లేకుండా ఉండండి. కలెక్టర్ ఛాంబర్ నుండి చూస్తే నిత్యం కూలగొట్టి న వినోభావే కాలనీ వాసులు కనిపిస్తారు.రాత్రికి రాత్రి వారు ఆక్రమణదారులు ఎలా అయ్యారు?వారక్కడనివాసం ఉన్న విషయం ఇప్పటికే మీకంటే ముందు బాధ్యతలు నిర్వహించిన ముగ్గురు కలెక్టర్ లు మారారు, వారికి కనిపించని ఆక్రమణదారులు మీకే వారు ఆక్రమణదారులు గా ఎలాకనిపించారు? ప్రజలకు జీవించే హక్కు లేదా?కోర్టు ఉత్తర్వులు పై వారికి వ్యక్తి గత నోటీసులు ఇచ్చి సమయం ఇవ్వకుండా పసిపిల్లలను గూడా భయబ్రాంతులకు గురిచేసేలా, అధికారిక సామూహిక దాడిచేసిన, భయబ్రాంతులకు గురి చేసిన అధికారులపై చర్యలు ప్రభుత్వం ఎందుకు తీసుకోదని నిలదీశారు..ప్రక్కనే ఉన్న మాజీ మంత్రి, ఇప్పుడున్న రెవెన్యూ మంత్రి,ఉప ముఖ్యమంత్రి అనుచరుడు,మరో మంత్రి వద్ద ఉన్న భూములు ,వాటిచరిత్ర వివరాలు,ప్రజలముందు ప్రకటించండి.మీనిజాయితీ నిరూపించుకొండి.పేదలు ఇళ్ళుకూల్చడంపై విచారణ సంఘం వేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని TRS (D) పార్టీగా డిమాండ్ చేసారు..అదికారులు దయచేసి తప్పుడు ప్రకటనలతో జరిగిన సంఘటన లకు “మసిపూసి మారేడు కాయ “చేయడం కాకుండా ప్రజల పన్నులతో జీతం తీసుకుంటున్న అధికారులుగా ఆలోచించండి.అదికారంలోఉన్నవారి అహంకారం కళ్ళజోళ్ళను కాసేపుబయటపడేసి చూడండి.ఇంత అరాచకాలకు పాల్పడిన మీకు అన్నం ఎలా సయిస్తుంది?ఓసారి గుండెలమీద చెయ్యి వేసుకొని,మీ పిల్లలమీద ప్రమాణం వేసి నిజాలు చెప్పండి, అబద్ధాలు కాదు.అదికారులు తక్షణమే భూదానోద్యమ భూమి 275ఎకరాలు ఎవరి స్వాధీనంలో ఉన్న ఈకాలనీపై చర్య తీసుకున్న విధంగా స్వాధీనం చేసుకొని వేలంద్వారా అమ్మి ప్రభుత్వం కు3వేలకోట్లు లబ్థిచేకూర్చండి.జిల్లాఅంతా పేదలకు ఇందిరమ్మ ఇండ్ల ను కట్టించిన వారవుతారు?పై ప్రశ్నలకు అదికారులు, ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని నరాలసత్యనారాయణ డిమాండ్ చేసారు.

Related News

Select the Topic
Scroll to Top