EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

లైసెన్స్ లేకపోతే బండి సీజ్.. వాహనదారులకు అలర్ట్

ఈతరం భారతం హైదరాబాద్ మార్చి 1:

హైదరాబాద్ నగరంలో వాహనాలు నడిపే వారు ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలి. ట్రాఫిక్ పోలీసులు నేటి నుంచి ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారిని లక్ష్యంగా చేసుకుని ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఎవరైనా లైసెన్స్ లేకుండా పట్టుబడితే అక్కడికక్కడే వాహనాన్ని సీజ్ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. వాహనదారులు విధిగా తమ వెంట ఒరిజినల్ లైసెన్స్ లేదా డిజిటల్ కాపీని ఉంచుకోవాలని సూచిస్తున్నారు.తనిఖీల్లో పట్టుబడిన వారికి కేవలం జరిమానా విధించడమే కాకుండా వారికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ కూడా ఇస్తారు. లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇచ్చే యజమానులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జాయింట్ సీపీ హెచ్చరించారు. పట్టుబడిన వాహనదారులు కోర్టుకు వెళ్లి ఫైన్ చెల్లించిన తర్వాతే తమ వాహనాలను విడిపించుకోవాల్సి ఉంటుంది. ఎల్.ఎల్.ఆర్ఉ న్నవారు నిబంధనల ప్రకారం వాహనంపై ‘L’ బోర్డు కలిగి ఉండాలని పోలీసులు గుర్తు చేస్తున్నారు.

Related News

Select the Topic
Scroll to Top