ఈతరం భారతం హైదరాబాద్ మార్చ్ 7:
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైబిజ్ టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కు చెందిన మహిళా విద్యావేత్త, సామాజికవేత్త డాక్టర్ గుగులోతు శ్రీదేవి విమెన్స్ లీడర్షిప్ అవార్డు – 2026 ను అందుకున్నారు. విద్య, సామాజిక సేవా రంగాలలో అందించిన విశిష్ట సేవలకు గాను హైబిజ్ టీవీ యాజమాన్యం ఈ రాష్ట్రస్థాయి అవార్డుకి ఆమెను ఎంపిక చేసి హైదరాబాద్ వేదికగా ఘనంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖుల చేతుల మీదుగా అందజేశారు. అవార్డు అందుకున్న డాక్టర్ శ్రీదేవికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.















