EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

గద్దర్ సినీ అవార్డుల ప్రకటన.. ఉత్తమ నటుడుగా నాగచైతన్య.. రష్మికకు ఉత్తమ నటి అవార్డు

హైదరాబాద్ మార్చ్ 7 ఈతరం భారతం:

2025 సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వం గద్దర్ సినీ అవార్డులను ప్రకటించింది. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31, 2025 వరకూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిబిఎఫ్‌సి) పొందిన చిత్రాలకు ఈ అవార్డులను ప్రకటించారు. అంతేకాక.. సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన పలువురు ప్రముఖులకు ప్రత్యేక అవార్డులు ప్రధానం చేయనున్నారు. ఉగాది సందర్భంగా మార్చి 19న అవార్డుల ప్రధానం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ అవార్డుల్లో ఉత్తమ చిత్రం అవార్డు ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రానికి దక్కగా.. ‘తండేల్’ చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా నాగచైతన్య నిలిచాడు. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రానికి రష్మికకు ఉత్తమ నటి అవార్డు లభించింది. ఇక మెగాస్టార్ చిరంజీవికి ఎన్టిఆర్ జాతీయ అవార్డు, నటుడు కమల్ హాసన్‌కు పైడి జయరాజ్‌ అవార్డు లభించాయి. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌కు నాగిరెడ్డి చక్రపాణి అవార్డు, నటి జయసుధకు ఎఎన్నార్ అవార్డు దక్కింది. కాంతారావు అవార్డు నటుడు ఆర్.నారాయణమూర్తికి, సింగీతం శ్రీనివాసరావుకు బి.ఎన్.రెడ్డి అవార్డు దక్కింది.మిగితా అవార్డుల జాబితా ఇదే..

ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయి ఉత్తమ ద్వితీయ చిత్రం – దండోరా ఉత్తమ తృతీయ చిత్రం – ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఉత్తమ దర్శకుడు – సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి) బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ – తండేల్ ఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రం – కోర్ట్ ఉత్తమ డాక్యుమెంటరీ – యూనిటీ ఉత్తమ ప్రజాదరణ చిత్రం – సంక్రాంతికి వస్తున్నాం! ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ పరిచయ దర్శకుడు – సాయి మార్తాండ్ (లిటిల్ హార్ట్స్) ఉత్తమ బాలల చిత్రం – అనగనగా ఉత్తమ సహాయ నటుడు – శివాజీ (దండోరా) ఉత్తమ సహాయ నటి – భూమిక (యుఫోరియా) ఉత్తమ సంగీత దర్శకుడు – మార్క్ రాబిన్ (దండోరా) ఉత్తమ గాయకుడు – అనురాగ్ కులకర్ణి (రాజు వెడ్స్ రాంబాయి) ఉత్తమ గాయని – సాహితీ (కన్నప్ప) ఉత్తమ బాలనటుడు – మాస్టర్ రోహన్ (ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో) ఉత్తమ కథా రచయిత – గుణశేఖర్ (యుఫోరియా) ఉత్తమ స్క్రీన్‌ప్లే – అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం) ఉత్తమ గేయ రచయిత – నందకిశోర్ (కుబేర) ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – కార్తిక్ ఘట్టమనేని (మిరాయ్) ఉత్తమ ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్) ఉత్తమ ఆడియోగ్రాఫర్ – ఎం.ఆర్ రాధాకృష్ణన్ (కిష్కింధపురి) ఉత్తమ కొరియోగ్రాఫర్ – సందీప్ (ఛాంపియన్) ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ – తోట తరణి (ఛాంపియన్) ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ – గోవిందరాజు (అఖండ-2) ఉత్తమ కాన్ట్యూమ్ డిజైనర్ – చంద్రకాంత్ (ఛాంపియన్) ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ – పీటర్ (ఛాంపియన్) ఉత్తమ పర్యవరణ చిత్రం – ఇగ్వా స్పెషల్ జ్యూరీ అవార్డులు శ్రీరాజ్ రాచకొండ (23 ఫిల్మ్) చైతు జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి) రోషన్ మేక (ఛాంపియన్) అనంతిక (8 వసంతాలు)

 

 

Related News

Select the Topic
Scroll to Top