EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రైల్వే టికెట్ కన్ఫర్మేషన్ లో గర్భిణీ స్త్రీలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రత్యేక కోటా కల్పించాలి    కేంద్ర రైల్వే శాఖా మంత్రికి రైల్వే వినియోగదారుల సలహా కమిటీ సబ్యులు కాలపురెడ్డి సాయిబాబా విజ్ఞప్తి 

హైదరాబాద్ మార్చ్ 10 ఈతరం భారతం:

రైల్వే టికెట్ కన్ఫర్మేషన్ లో గర్భిణీ స్త్రీలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రత్యేక కోటా కల్పించాలని కేంద్ర రైల్వే శాఖా మంత్రికి రైల్వే వినియోగదారుల సలహా కమిటీ సబ్యులు కాలపురెడ్డి సాయిబాబా విజ్ఞప్తి చేసారు. ఈమేరకు సోమవారం రైల్వే శాఖా మంత్రికి లేఖ రాసారు.తరుచుగా దక్షిణ మధ్య రైల్వే జోన్ నందు రోజు వారిగా లక్షలాది మంది ప్రయాణికులు వాళ్ళ అత్యవసరాల కోసం అత్యవసరముగా ప్రయాణిస్తున్నారు. అందులో వృద్దులకు, వైకల్యం ఉన్న వ్యక్తులకు, మహిళలకు, ఉద్యోగుల కార్డు ఉన్న వారి కోసం మరియు ప్రీమియం తత్కాల్ అని ప్రత్యేక కోటా ఏర్పాటు చేయడం జరిగింది. కాని గర్భిణీ స్త్రీలు రిజర్వేషన్ టికెట్ నిర్ధారణ (కన్ఫర్మేషన్) కాకపోవడం వల్ల జనరల్ బోగిలలో ప్రయాణించడానికి అష్టకష్టాలు పడుతున్నారు. కావున రైల్వే టికెట్ బుక్ చేసినప్పుడు వారి మెడికల్ సర్టిఫికేట్ ను గమనించి వారికి కుడా ప్రత్యేక కోటా ఏర్పాటు చేయాలనీ మరియు వారి టికెట్ కన్ఫర్మేషన్ అయ్యేలాగా చేసి వారి సమస్యలను కుడా దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు.అలాగే క్యాటరింగ్ & ఆహార నాణ్యత విక్రేతల నుండి నాణ్యత లేకపోవడం. అధిక ధరలు – స్టేషన్లలో ఆహారం అందుబాటులోకి తేవాలని, సాంకేతిక & మౌలిక సదుపాయాల సమస్యలు ఫ్యాన్లు, లైట్లు లేదా ఛార్జింగ్ పాయింట్లు పనిచేయకపోవడం వాష్‌రూమ్‌లలో నీటి కొరత ను తీర్చాలని, సరైన సమాచారం లేకపోవడంతో ప్లాట్‌ఫామ్‌లలో ఆకస్మిక మార్పులు – గందరగోళం. రైళ్ల ఆలస్యం లేదా రూట్ మార్పుల గురించి సరైన ప్రకటనలు లేవు. చివరి నిమిషంలో రైలు రద్దు చేయడం వాళ్ళ ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు..టిక్కెట్ల కొనుగోలు సమస్యలు ధృవీకరించబడిన టిక్కెట్లను పొందడంలో ఇబ్బంది. ఏజెంట్‌లు ద్వారా అధిక ఛార్జీలు – ఆ సమయానికి తత్కాల్ టికెట్ అందుబాటులోకి తీవాలని, మురికి కోచ్‌లు, టాయిలెట్‌లు మరియు ప్లాట్‌ఫారమ్‌లు అపరిశుభ్రమైన ఆహారం మరియు నీటి నాణ్యత లేకుండా పోతుందని,జనరల్ కంపార్ట్‌మెంట్‌లలో రద్దీగా ఉండడం వల్ల రిజర్వేషన్ కంపార్ట్‌మెంట్‌లలో ప్రయాణించడం సమస్యగా మారుతుందని తెలిపారు.సామాను మరియు వ్యక్తిగత వస్తువుల దొంగతనం. భద్రతా సమస్యలు, సహ ప్రయాణీకులు లేదా అనధికార విక్రేతల వేధింపులు లేదా దుర్వినియోగం. దూర ప్రాంతాలలో RPF (రైల్వే రక్షణ దళం) ఉనికి లేకపోవడం.పై ద్రుష్టి సారించాలని కోరారు.

Related News

Select the Topic
Scroll to Top