EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

పార్టీలో పదవులు రాని వారు నిరాశ చెందొద్దు, పదవులు వచ్చినా రాకున్నా నేను అందరినీ గుర్తిస్తా

ఈతరం భారతం సంగారెడ్డి సెప్టెంబర్ 9 బుధవారం

_______________________________________

సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కమిటీల నియామక సమావేశం బుధవారం సంగారెడ్డి పట్టణంలోని క్లాసిక్ గార్డెన్స్‌లో జరిగింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల కాంగ్రెస్ పార్టీ కమిటీలను ప్రకటించారు.అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా, ఐఎన్‌టీయూసీ, కాంగ్రెస్ కిసాన్ సెల్‌తో పాటు ఇతర ఫ్రంటల్ ఆర్గనైజేషన్ల కమిటీలను సైతం ప్రకటించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ పార్టీకి పదవులు వచ్చిన వారు, రాని వారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ గుర్తించి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.

పార్టీలో పదవులు రాని వారు ఎలాంటి నిరాశకు గురికావద్దని, పదవులు ఉన్నా లేకపోయినా ప్రతి కార్యకర్తను తాను గుర్తిస్తానని జగ్గారెడ్డి అన్నారు. అందరూ కలిసికట్టుగా, సమన్వయంతో పనిచేసి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై త్వరలో వరుస సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. నాలుగు మండలాలకు చెందిన గెలిచిన, ఓడిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో అధికారుల సమక్షంలో ప్రత్యేక రివ్యూ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.అదేవిధంగా రెండు మున్సిపాలిటీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, అధికారులతోనూ ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 30 నుంచి నాలుగు రోజుల పాటు వరుసగా సమావేశాలు నిర్వహించి, ప్రతి ఒక్కరితో వన్‌టు‌వన్‌గా మాట్లాడతానని చెప్పారు.

ఈ సమావేశాలకు పోలీసు శాఖతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను కూడా పిలిచి ప్రజా సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై చర్చిస్తామని జగ్గారెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగుతూ ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు.

Related News

Select the Topic
Scroll to Top