ఈతరం భారతం ఖమ్మం : సెప్టెంబర్ 9 బుధవారం
_______________________________________
యశోద మెడికల్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ కార్డియాలజీ డాక్టర్ కళా జితేందర్ జైన్ మాట్లాడుతూ గుండె మరియు ఊపిరితిత్తుల సమస్యలతో అత్యంత విషమ స్థితిలో ఉన్న 60 ఏళ్ల పేషేంట్‌కు , యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ కార్డియాలజీ మరియు పల్మోనాలజీ బృందాలు విజయవంతంగా ‘మినిమల్లీ ఇన్వాసివ్ మిట్రాక్లిప్’ ప్రొసీజర్‌ను చేసి ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించాయి . ఆ పేషేంట్ దాదాపు మూడు వారాలుగా వెంటిలేటర్ సపోర్ట్‌పై ఉన్నారు . అంతేకాకుండా , తీవ్రమైన మిట్రల్ రిగర్గిటేషన్ (MR – గుండె కవాటం సమస్య)తో బాధపడుతున్నారు . దీనివల్ల ఆయనకు పదే పదే హార్ట్ ఫెయిల్యూర్ సమస్య ఎదురైంది . పేషేంట్ గుండెలోని మిట్రల్ వాల్వ్ సరిగ్గా మూసుకోకపోవడం వల్ల , రక్తం వెనక్కి ప్రవహించి గుండెపై తీవ్రమైన ఒత్తిడి పడుతోంది . పేషేంట్ యొక్క విషమ పరిస్థితి , ఊపిరితిత్తుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని , డాక్టర్లు మినిమల్లీ ఇన్వాసివ్ పద్ధతిని ఎంచుకున్నారు . ఓపెన్ – హార్ట్ సర్జరీ అవసరం లేకుండానే మిట్రల్ రిగర్గిటేషన్‌ను తగ్గించే ఈ ‘మిట్రాక్లిప్’ ప్రొసీజర్‌ను కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కళా జితేందర్ జైన్ మరియు కార్డియాలజీ బృందం, సీనియర్ కన్సల్టెంట్ (క్లినికల్ & ఇంటర్వెన్షనల్ పల్మోనాలజీ) డాక్టర్ వి. నాగార్జున మాటూరు మరియు క్రిటికల్ కేర్ బృందంతో సమన్వయం చేసుకుంటూ విజయవంతంగా పూర్తి చేశారు . పేషేంట్ పరిస్థితి చాలా విషమంగా ఉండటం , తీవ్రమైన మిట్రల్ రిగర్గిటేషన్ , ఊపిరితిత్తుల సమస్యలు ఉండటం , అలాగే కొన్ని వారాల పాటు వెంటిలేటర్ పైనే ఉండటం వల్ల ఇది చాలా సవాలుతో కూడుకున్న కేసు . ఇలాంటి హై – రిస్క్ పేషేంట్లకు , సాధారణ ఓపెన్ – హార్ట్ సర్జరీకి బదులుగా మిట్రాక్లిప్ లాంటి మినిమల్లీ ఇన్వేసివ్ విధానం ఒక మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది . ఈ ప్రొసీజర్ విజయవంతం కావడంతో పేషేంట్ గుండె పరిస్థితి మెరుగుపడింది . అలాగే పెద్ద సర్జరీ వల్ల వచ్చే ప్రమాదాలను నివారించి , పేషేంట్ త్వరగా కోలుకునేలా చేయగలిగాము,” అని అన్నారు . ఈ ప్రొసీజర్ తర్వాత , పేషేంట్ ఆరోగ్య పరిస్థితిలో గణనీయమైన మెరుగుదల కనిపించింది. చికిత్స జరిగిన కేవలం నాలుగు రోజులకే ఆయనను హాస్పిటల్ నుండి విజయవంతంగా డిశ్చార్జ్ చేశారు . యశోద హాస్పిటల్స్ యొక్క మల్టీడిసిప్లినరీ విధానం , అత్యాధునిక ఇంటర్వెన్షనల్ కార్డియాక్ సామర్థ్యాలు , అలాగే కార్డియాక్, పల్మనరీ మరియు క్రిటికల్ కేర్ విభాగాల సమన్వయంతో అత్యంత సంక్లిష్టమైన , హై-రిస్క్ గుండె పేషేంట్లకు సైతం మెరుగైన చికిత్స అందించగల సత్తాకు ఈ విజయమే ఒక నిదర్శనం అని అన్నారు . ఖమ్మం యశోద మెడికల్ సెంటర్ నందు ప్రతి నెల 2వ – 4వ బుధవారాలు అందుబాటులో ఉంటానని తెలిపారు . ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్స్ డి. బాలరాజు , డి. శ్రీకాంత్ పాల్గొన్నారు.















