EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

డెక్కన్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్

హైదరాబాద్ మార్చ్ 10 ఈతరం భారతం:

డెక్కన్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం రామ్ నగర్ బస్తి వాసుల కోసం ఉచిత మెడికల్ క్యాంప్ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ క్యాంప్‌లో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలను పొందారు.ఈ కార్యక్రమానికి జి.మాధవి నేత్రుత్వం వహించారు.ఈ కార్యక్రమంలో సాధారణ వైద్య పరీక్షలతో పాటు దంత (డెంటల్) పరీక్షలు మరియు కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వైద్య సలహాలు మరియు ఉచిత మందులు అందించారు.ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ఇలాంటి ఉచిత మెడికల్ క్యాంపులను డెక్కన్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ వివిధ ప్రాంతాల్లో నిరంతరం నిర్వహిస్తుందని నిర్వాహకులు తెలిపారు.ఈ క్యాంప్ నిర్వహణలో సహకరించిన వైద్య బృందం, వాలంటీర్లు మరియు పాల్గొన్న ప్రజలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top