EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సనాతన సాంప్రదాయ పరిరక్షణలో శ్రీ వైష్ణవుల పాత్ర ప్రశంసనీయం

హైదరాబాద్ మార్చ్ 15 ఈతరం భారతం:

విశ్వవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణలో శ్రీవైష్ణవులు భగవత్ సేవ ద్వారా, సనాతన సాంప్రదాయాన్ని పరిరక్షిస్తూ, ప్రజలలో భక్తి భావను పెంపొందించేందుకు అవిరళంగా కృషి చేయడాన్ని ప్రశంసిస్తూ శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామివారు మంగళాశాసనాలను అందించారు.యస్.వి.యస్. ట్రస్ట్ సౌజన్యంతో శ్రీవైష్ణవ సేవా రాష్ట్ర సంఘం, స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సర “ఉగాది ఉత్సవాలు” మరియు “డైరీ- మరియు పంచాంగం” ఆవిష్కరణ కార్యక్రమాన్ని యల్.బి.నగర్లోని యస్.వి.యస్. ట్రస్ట్ వారి “శ్రీవైష్ణవ సదనం”లో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈకార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి యం.యల్.ఏ. యల్.బి.నగర్,, శ్రీ వేముల శ్రీనివాస్ , ముఖ్యమంత్రి గార ఓ.యస్.డి. గారలు సమావేశంలో పాల్గొని సందేశాలిచ్చారు.ఈ కార్యక్రమంలో పంచరాత్రిగమము, ఉభయ వేదాంత పండిత, వేద పండిత, ధార్మిక సాంప్రదాయం సాహిత్యం, మనుష్య యాజ్ఞికం, శ్రీ వైష్ణవ సంప్రదాయ సేవ లాంటి విషయాల్లో ప్రముఖులైన పండితులను “పండిత పురస్కారాలతో” (శ్రీమాన్ గోవర్ధనగిరి జగన్నాథచార్యులు, మరింగంటి కుశేఖరాచార్యులు, మరిగంటి గోవర్ధనాచార్యులు, శ్రీసుదర్శనం శ్రీనివాసాచార్యులు, శ్రీ అద్దంకి శ్రీనివాస్, శ్రీమాన్ దరిపెల్లి లక్ష్మణాచార్యులు, శ్రీముడుంబై లక్ష్మీ నరసింహాచార్యులు తదితరులకు) ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఛైర్మన్ శ్రీ కె. యాదగిరాచార్యులు, ప్రధానకార్యదర్శి సి.హెచ్. లక్ష్మీనాథాచార్యులు, శ్రీ భాష్యం యదుమోహన్, శ్రీ వైష్ణవ సేవా రాష్ట్ర సంఘ అధ్యక్షులు తిరువరంగం ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి పీచర కృష్ణమాచార్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్ డింగరి రవి, అదనపు ప్రధాన కార్యదర్శి సత్యనారాయణాచార్యులు, శ్రీ గోవర్ధనగిరి అనంతాచార్యులు, చక్రవర్తుల రామకృష్ణమాచార్యులు, శేషం వెంకటాచార్యులు, కోశాధికారి పవన్, ట్రస్ట్ సభ్యులు డా॥ సి.హెచ్. రమణాచార్యుల, శరగోపాచార్యులు, నరేంద్రాచార్యులు, మాధవాచార్యులు, వరదాచార్యులు మరియు సంఘ నాయకులు రామకృష్ణచార్యులు, ఫణిహారం శ్రీకాంత కృష్ణమాచార్యులు ప్యారక అరుణ, డింగరి శ్రీకాంత్, నందకిశోర్ తదితరులు 33 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సమావేశం, ఈ క్రింది తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది.బ్రహ్మణ పరిషత్కు పాలకవర్గాన్ని వెంటనే నియామకం చేయాలి.బ్రాహ్మణ పరిషత్లో 50% పదవులను శ్రీ వైష్ణవులకు కేటాయించాలి.తెలంగాణలో ప్రభుత్వం నియామకం చేస్తున్న దేవాలయాల పాలకవర్గాలలో బ్రాహ్మణులతో సమానంగా శ్రీవైష్ణవులకు కూడా నియామకం చేయాలి.గ్రామాలు, మండల కేంద్రాలు, జిల్లాల్లో నివసించే శ్రీవైష్ణవ పురోహితులకు, అర్చకులకు ఇండ్ల స్థలాలు కెటాయించి, గృహాలను మంజూరి చేయాలి.ప్రభుత్వ దేవాలయాల్లో పనిచేసే దూపదీప నైవేద్య అర్చకులకు కల్పిస్తున్న “భీమా సౌకర్యం” మరియు “వైద్య సౌకర్యాలను” ప్రైవేట్ దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు, పురోహితులకు కూడా వెంటనే వర్తించే విధంగా తగు ఉత్తర్వులను విడుదల చేయాలి.

Related News

Select the Topic
Scroll to Top