హైదరాబాద్ మార్చ్ 15 ఈతరం భారతం:
రేవంత్ రెడ్డి ప్రభుత్వం లో అక్రమారుకులకే అందలం ఎక్కుతున్నారని , అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపై వారిపై ఏసిబి తో విచారణ జరిపించాలని తెలంగాణ మున్సిపల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్. తాజ్ మోహన్ రెడ్డి డిమాండ్ చేసారు. ఈ మేరకు ముఖ్య మంత్రికి బహిరంగ లేఖ రాసారు. తమ దృష్టికి తేవడం ఏమనగా గత టిఆర్ఎస్ ప్రభుత్వం హయాం లో ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకొని తమరు ముఖ్యమంత్రి కావాలన్నా దృఢ సంకల్పంతో ఉత్తర తెలంగాణ పలు జిల్లాలలో మున్సిపల్ ఉద్యోగ సంఘం తరఫున ఉదృతంగా ప్రచారం చేయడం జరిగింది. నాకు గత ప్రభుత్వం హయాంలో సరైన పోస్టింగ్ ఇవ్వకుండా మీకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న నెపం తో క్రమశిక్షణ చర్యల పేరుతో చర్యలు తీసుకోవడం జరిగింది. అయినా వెనుకంజ వేయకుండా తమరు ముఖ్యమంత్రి కావాలన్నా అకంటిత దీక్షతో పనిచేయడం జరిగింది. నేటికి తమ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల 3 నెలలు కావస్తున్న తెలంగాణ ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం చేకూరకపోగా గత ప్రభుత్వం హయాంలో చెలామణి అయినా ప్రభుత్వ ఉద్యోగులను కీలకమైన స్థానాల్లో ఇటీవల నియమించడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.గత ప్రభుత్వం హయాంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వద్ద ఓఎస్డిగా పనిచేసిన కే.మహేందర్ అనే వ్యక్తిని తమరు ప్రభుత్వం ఏర్పాటు చేయగానే మహేందర్ ను ఖమ్మం జిల్లాకు ఎలాంటి ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేయడం జరిగింది. ఆరు నెలలు గడువక ముందే మహేందర్ అనే వ్యక్తిని ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఆఫీసర్ గా నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు ఇవ్వడం బాధాకరం. దీనిని తెలంగాణ మున్సిపల్ ఉద్యోగుల సంఘం తీవ్రంగా పరిగణిస్తుంది.ఇతను గత పది సంవత్సరాలుగా పేషిని తన గుప్పిట్లో పెట్టుకొని ఏక చత్రాదిపత్యంగా ఇష్టానుసారంగా బదిలీలు చేయడం, క్రమ శిక్షణా చర్యలను ఉపసంహరిస్తూ కోట్లాది రూపాయలను సంపాదించడం జరిగినది. ఇతనికి గిట్టని మునిసిపల్ ఉద్యోగులను చులకన చేస్తూ వారి వ్యక్తి గత ప్రవర్తనకు మచ్చ వచ్చే విదముగా వారిపై మంత్రులకు, ఎంఎల్ఏ లకు చెప్పుడు మాటలు చెప్పి సరైన పోస్టింగ్ రాకుండా అడ్డుకోవడం జరిగింది. దీనిపై తమరు సమగ్ర విచారణ జరిపించినచో ఆదారాలతో రుజువు చేయడానికి తెలంగాణా ఉద్యోగుల సంఘం సిద్దంగా ఉన్నది. ఇతన్ని తక్షణమే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఆఫీసర్ పదవినుండి తొలిగించాలని తెలంగాణ మున్సిపల్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తుంది. ఇతని పోస్టింగ్ ఉదంతం పై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు.
తమ ప్రభుత్వం లో మరొక బదిలీ ఉదంతం ఏమనగా వి.మమతను తమరు ప్రభుత్వం ఏర్పాటు చేయగానే మమతను షేర్ లింగంపల్లి జోనల్ కమిషనర్ నుండి తొలగించి ఆదిలాబాద్ కు బదిలీ చేయడం జరిగింది. ఆమె బదిలీ అయిన స్థానంలో పనిచేయకుండా దీర్ఘకాలిక సెలవుపై అమెరికాకు వెళ్లడం జరిగింది.తిరిగి అమెరికా నుండి వచ్చిన తర్వాత ఆమెకు రెడ్ కార్పెట్ పరిచి డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు బదిలీ చేయడం ఇది రెండవ ఉదాహరణ. అని తెలిపారు..ఇలాంటి వ్యక్తులను తిరిగి యదాస్థానానికి తేవడం తెలంగాణ మున్సిపల్ ఉద్యోగుల సంఘం ఖండిస్తుంది. గచ్చి బౌలిలోని తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగులకు సంబందించిన ఇండ్ల స్థలాల కేటాయింపులో గత ప్రభుతం లో పని చేసిన మాజి మంత్రి తో కుమ్ముక్కై పెద్ద ఎత్తున దనార్జన చేయడం జరిగినది. దీనిపై ఏసిబి తో విచారణ జరిపించవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని పేర్కొన్నారు.గతములో తమరు పిసిసి అధ్యక్షులుగా ఉండగా రవాణా శాఖలో పని చేస్తున్న పాపారావు పై తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగినది. తమరు ముఖ్య మంత్రి అయిన తర్వాత్య అతనిపై ఏలాంటి విచారణ జరిపించక పొగా 24 గంటల్లో స్వచ్చంద పదవి విరమణకు అనుమతించడం అత్యంత విచారకరం. బిఆర్ఎస్ హయం లోఆయన రవాణా శాఖా మంత్రిగా చలామణి అయి MVI, AVI మరియు RTO ల పోస్టింగ్ల విషయం లో లక్షలాది రూపాయలను దండుకొని పోస్టింగ్ లు ఇవ్వడం జరిగింది. ఇతను పాల్పడిన అవినీతి పై తమరికి పూర్తిగా అవగాహన గలదు.ఐనను అతనికి 24 గంటలలో స్వచ్చందంగా పదవి విరమణ ఉత్తర్వులు ఇవ్వడం జరిగినది. ఉత్తర్వులు అందిన వెంటనే ఇతను అమెరికాకు వెళ్ళిపోవడం జరిగినది. ఇతనిపై సమగ్ర విచారణ జరిపించాల్సింది పోయి ఆగమేగాల మీద స్వచ్చందంగా విరమణ ఉత్తర్వులు ఇవ్వడం లో గల ఆంతర్యమేమిటి ? దీనిపై సమగ్ర విచారణ జరుగాల్సిన అవసరం ఉందన్నారు. ఇంకొక ఉదహరణ నరేందర్ రావు అనే వ్యక్తీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా వ్యవహరిస్తూ బిఆర్ఎస్ హయం లో సంవస్సరానికి ఒక పదోన్నతులు పొంది జైంట్ సెక్రెటరి గా అక్రమంగా పదోన్నతులు పొందటం జరిగినది.ఇతను సచివాలయాన్ని ప్రతి వేడుకు గులాభి రంగులతో తెలంగాణా భవన్ గా మార్చడం జరిగినది. ఇలాంటి వ్యక్తి పై కూడా విచారణకు ఆదేశించకుండా స్వచ్చందంగా పదవి విరమణకు ఉత్తర్వులు ఇవ్వడం పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు మేము బావిస్తున్నాము. చివరగా గౌరవ ముఖ్యమంత్రి గారితో మనవి చేయడం ఏమనగా పైన పేర్కొన బడిన నలుగురు ఉద్యొగుల అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణకు ఆదేషించి తెలంగాణా ప్రయోజనాలు కాపాడుతారని,కేసిఅర్ హయం లో కొందరు ఉద్యోగుల పై ఏకపక్షంగా తీకోబడిన చర్యలపై పునర్ సమీక్ష చేసి తెలంగాణా ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడుతారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.















