EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

టీపీసీసీ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు గా ఎర్రబెల్లి స్వర్ణ పదవీ బాధ్యతలు స్వీకరణ

హైదరాబాద్ మార్చ్ 15 ఈతరం భారతం :

టీపీసీసీ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు గా ఎర్రబెల్లి స్వర్ణ ఆదివారం గాంధీ భవన్ లో పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమానికిముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , అల్ ఇండియా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబ, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావ్, రాష్ట్ర మహిళ కాంగ్రెస్ ఇంచార్జ్ తదితరులు హాజరైనారు.అలాగే ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఇంచార్జ్ హార్కర్ వేణు గోపాల్ రావు , ఎంపీ కడియం కావ్య ,కాంగ్రెస్ నాయకులు గుండు సుధారాణి ,కోట నీలిమ , నేరెళ్ళ శారద ,శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా టిపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఎర్రబెల్లి స్వర్ణ కు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ప్రకాశం హాల్ లో జరిగిన కార్యక్రమం లో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మహిళ కాంగ్రెస్ కార్యకర్తలకు చాలా వరకు డైరక్టర్ పదవులుm, ఆరుగురు మహిళలకు డిసిసి పదవులు ఇచ్చాం, మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం మహిళా సెంట్రిక్ గా ప్రజా పాలన ప్రభుత్వం అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలు పోటీ చేసే అవకాశం కల్పించామన్నారు. 30 ఏళ్ల తర్వాత అల్కా లాంబ గారితో వేదికను పంచుకుంటున్న మహిళల్నిరాష్ట్రపతి,గవర్నర్లు,స్పీకర్లు,ముఖ్యమంత్రిగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది రాబోయే ఎన్నికల్లో 51 మంది మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండబోతున్నారు. రాబోయే పదవుల్లో 20 శాతం మహిళలకు చైర్మెన్ పదవులు ఇవ్వాలనే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి బిఆర్ ఎస్ పదేళ్ల హయంలో డ్రగ్స్,గంజాయి, కొకైన్ పెంచి పోషించారు కేటీఆర్ పై అనుమానాలు ఉన్నాయి పదేళ్ల బిఆర్ఎస్ హయాంలో తెలంగాణ ను డ్రగ్స్ మయంగా మార్చారు సీఎం రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రుల నేతృత్వంలో డ్రగ్స్ కంట్రోల్ సిగ్గుతో తల దించుకోవాల్సిన కేటీఆర్ ఉల్టా చోర్ మాటలు మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమం,అభివ్రుది కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ది పనులను ఎర్రబెల్లి స్వర్ణ నేతృత్వడంలో ప్రజలకు చేరువ చేయండి గడప గడప కు అభివ్రుది కార్యక్రమాలను తీసుకెల్లలని పిలుఒపునిచ్చారు.

Related News

Select the Topic
Scroll to Top