EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

హైదరాబాద్ మార్చ్ 17 ఈతరం భారతం:

ప్రముఖ కవి, రచయిత నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 2026 సంవత్సరానికి గాను ఆయన రాసిన ‘అనిమేష’ కవితా సంపుటికి ఈ పురస్కారం లభించింది. కరోనా కాలంలోని సామాజిక పరిస్థితులు, మానవీయ కోణాలను ఈ కవితా సంపుటిలో సిద్ధారెడ్డి చిత్రించారు. సాహిత్య అకాడమీ అవార్డు కింద రూ.లక్ష నగదు, తామ్రపత్రం, శాలువాను ప్రధానం చేస్తారు. నందిని సిద్ధారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమి తొలి ఛైర్మన్‌గా పని చేశారు. సిద్ధారెడ్డికి సాహిత్య అకాడమి అవార్డు రావడంపై బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ సాహిత్యానికి దక్కిన గౌరవం అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top