EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

హైదరాబాద్ మార్చ్ 20 ఈతరం భారతం:

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్‌ మొత్తం విలువ రూ.3,24,234 కోట్లుగా ఆయన వెల్లడించారు. రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లుగా, మూలధన వ్యయం రూ.47,267 కోట్లు, తలసరి ఆదాయం రూ.4,18,931 కోట్లుగా పేర్కొన్నారు. రాష్ట్ర వృద్ధి రేటు 10.2 శాతమని ప్రకటించారు.

ఈ బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖకు 26,674 కోట్లు, వ్యవసాయ శాఖకు 23,179 కోట్లు, విద్యుత్ శాఖకు 21,285 కోట్లు, పౌరసరఫరాల శాఖకు 7,366 కోట్లు, పశుసంవర్ధక శాఖకు 1,529 కోట్లు, వైద్య శాఖకు 13,679 కోట్లు, కార్మిక శాఖకు 998 కోట్లు, పర్యాటక రంగానికి 1,224 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖకు 3,143 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి రూ.11,784 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.7,937 కోట్లు, బీసీ సంక్షేమానికి 12,511 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి రూ.3,769 కోట్ల చొప్పున కేటాయించారు.

అదేవిధంగా పట్టణాభివృద్ధి, పురపాలక శాఖకు రూ.17,907 కోట్లు, న్యాయశాఖకు రూ.2,367 కోట్లు, రవాణా శాఖకు రూ.12,759 కోట్లు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలకు రూ.33,688 కోట్లు, ఐటీ శాఖకు రూ.875 కోట్లు, పరిశ్రమల శాఖకు రూ.3,490 కోట్లు, చేనేతకు రూ.258 కోట్లు, గృహ నిర్మాణానికి రూ.7,430 కోట్లు, సాగునీటి ప్రాజెక్టులకు రూ.22,615 కోట్లు, రాజీవ్‌ యువ వికాసానికి రూ.6 వేల కోట్లు, శాంతిభద్రతలకు రూ.11,907 కోట్లు, గోదావరి పుష్కరాలకు రూ.500 కోట్ల చొప్పున కేటాయించినట్లు భట్టి తెలిపారు.

 

Related News

Select the Topic
Scroll to Top