EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

టీఎన్జీఓఎస్ సెంట్రల్ యూనియన్ ఆద్వర్యం లో రంజాన్ పర్వదిన వేడుకలు

హైద్రాబాద్ మార్చ్ 22 : ఈతరం భారతం ;

రంజాన్ పర్వదినం సందర్భంగా టీఎన్జీఓఎస్ యూనియన్ సెంట్రల్ జనరల్ సెక్రటరీ డా. ఎస్. ఎం. హుస్సైనీ ముజీబన్నాని శాలువా, పుష్పగుచ్ఛం మరియు హారంతో ఘనంగా సన్మానించి, ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమాన్ని టీఎన్జీఓఎస్ యూనియన్ హైదరాబాద్ అసోసియేట్ ప్రెసిడెంట్ మరియు టీఎన్జీఓఎస్ యూనియన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ తెలంగాణ సెంట్రల్ ఫోరం ప్రెసిడెంట్ కె.ఆర్. రాజ్‌కుమార్ , టీఎన్జీఓఎస్ యూనియన్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ బొలిగిడ్డ శంకర్ , పబ్లిక్ సెక్రటరీ వైదిక శాస్త్ర ఈసీఎస్ , శ్రీధర్ ,ముకీద్ ఖురేషీ , ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీఓఎస్ యూనియన్ ఐటీఐ యూనిట్ ప్రెసిడెంట్ సత్యనారాయణ , టీఎన్జీఓఎస్ యూనియన్ క్యాన్సర్ హాస్పిటల్ యూనిట్ ప్రెసిడెంట్ శివకుమార్ , సెక్రటరీ శేఖర్ , ట్రెజరర్ మహేష్ యాదవ్ , టీఎన్జీఓఎస్ యూనియన్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ కానిస్టేబుల్ ప్రెసిడెంట్ నయీమ్ , టీఎన్జీఓఎస్ యూనియన్ ఓఎంసీ యూనిట్ ప్రెసిడెంట్ అనిల్ టీఎన్జీఓఎస్ యూనియన్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ కృష్ణ , టీఎన్జీఓఎస్ యూనియన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ సెంట్రల్ ఫోరం జాయింట్ సెక్రటరీ సుదర్శన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శివ శేఖర్ , కల్చరల్ సెక్రటరీ శ్రీనివాస్, టీఎన్జీఓఎస్ యూనియన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ హైదరాబాద్ ఈసీ సభ్యుడు ప్రియదేవ్ ఠాకూర్ , టీఎన్జీఓఎస్ యూనియన్ ఈఎస్‌ఐ డిపార్ట్‌మెంట్ జాయింట్ సెక్రటరీ అఖీలాన్, ఉస్మాన్ భాయ్ , రామకృష్ణన్న , మహమ్మద్ భాయ్ పాల్గొన్నారు.అలాగే ఫజీయుల్లా , జుబేర్ ,మురళీధర్ , మధుకర్ , అధినారాయణ , అనిల్ కుమార్ , కృష్ణ , రాజు , దామోదర్ , కైరాజ్ , రమేష్ , రవి , బాలాజీ గోస్వామి , సురేష్ , సమీర్ , అన్వర్ , ఫరూక్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డా. ఎస్. ఎం. హుస్సైనీ ముజీబన్నా మాట్లాడుతూ, రమజాన్ పర్వదినం ముస్లింలకు అత్యంత పవిత్రమైనది అని, ఇది ఉపవాసం, నియమాలు, సహనం మరియు సేవా భావాన్ని పెంపొందించే కాలమని తెలిపారు. ఈ నెలలో మనసును పవిత్రంగా ఉంచి, అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా సమాజంలో సౌహార్దం మరియు ఐక్యతను పెంపొందించుకోవాలని సూచించారు.అంతేకాక, అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవంతో మరియు ప్రేమతో కలిసి జీవించాలనే సందేశాన్ని ఈ రమజాన్ పండుగ ఇస్తుందని పేర్కొన్నారు. ఈద్ పర్వదినం మన అందరికీ ఆనందం, శాంతి మరియు సౌభ్రాతృత్వం తీసుకురావాలని ఆకాంక్షిస్తూ, అందరికీ హృదయపూర్వక ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top