హైద్రాబాద్ మార్చ్ 22: ఈతరం భారతం
బి.సి లకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి డిమాండ్ చేస్తూ OBC జాతీయ సెమినార్లు జరపాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్ని వాగ్దానంలో ఇచ్చిన మాట ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలనీ మార్చి 30-31న చలో ఢిల్లీ కార్యక్రమం ఏర్పాటు చేసి చేసినట్లు రాజ్యసభ జాతీయ బీసీ సంఘం అధ్యకులు ఆర్. కృష్ణయ్య తెలిపారు. ఆదివారం18 బిసి సంఘాల సమావేశంజాతీయ బి.సి సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డా. ర్యాగ అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, ఒరిస్సా రాష్ట్రాల నుండి పెద్ద యెత్తున పోల్గొంటారని రాజ్యసభ సభ్యులు తెలిపారు. ప్రొపెసర్లు, మేధావులు మరియు ఈ సెమినార్ లో 8 మంది కేంద్రమంత్రులు, 20 మంది వివిద పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు పాల్గొంటారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని వాగ్దానం లో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం అమలు చేయాలి. BJP పార్టీ బి.సి వర్గానికి చెందిన నరేంద్ర మోడీనే ప్రధాన మంత్రిగా చేసారు. అంతే కాదు 27 మంది మంత్రులను, నలుగురు గవర్నర్లను చేసారు. అలాగే ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి చేసారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా ఒక దళితున్ని చేశారు. మొత్తం దేశంలో యున్న ఉన్నత పదవులన్నీ BC/SC/ST లాకి ఇచ్చారు. గతం ఆ పార్టీ అయిన ఇలా ఇచ్చారా! అని ప్రశ్నించారు. అలాగే జాతీయ బి.సి కమిషన్ కు రాజ్యాంగ బద్దమైన హోదా ఇచ్చారు. కేంద్రంలోని OBC కులాలకు ABCD వర్గీకరణ చేయడానికి GO జారీ చేశారు.ఇది సామాజిక న్యాయ చరిత్రలో ముందడుగుయని వ్యాఖ్యానించారు. దీనితో బి.సి.ల లెక్కలు పక్కగా ఖచ్చితమైన సంఖ్య తెలుపుతారు. అప్పుడే అన్ని రంగాలలో వాటా లభిస్తుంది.కేంద్రంలోని BJP ప్రభుత్వం తొలిసారిగా జనగణనలో కులగణన చేపడుతుంది. ఇది దేశచరిత్రలో రికార్డు, 76 సంవత్సరాల చరిత్రలో ఈ పార్టీ కూడా కులగణన చేయలేదు. కులగణన తర్వాత బి.సి.లకు అన్ని రంగాలలో ముఖ్యంగా ఆర్ధిక, రాజకీయ, సామజిక, విద్యా, ఉద్యోగ రంగాలలో జనాభా ప్రకారం వాటా లభిస్తుంది. అన్ని కోణాలలో కులగణన తర్వాత సమాజంలో విప్లవాత్మక మైన మార్పు వస్తుందన్నారు.
75 కోట్లకు పైగా ఉన్న బీసీ వర్గాల చిరకాల కులగణన డిమాండ్ను కేంద్రం గౌరవించినట్లుగా ఆయన పేర్కొన్నారు. 1931లో బ్రిటిష్ ప్రభుత్వం తీసిన లెక్కల తరువాత నరేంద్ర మోడి ప్రభుత్వం సాహసిపోతా నిర్ణయం తీసుకుందని ప్రశసించారు. ఇది చరిత్ర యన్నారు.కుల గణన తర్వాత బీసీలకు చట్టసభలలో 50% రిజర్వేషన్లు, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు పెంపు వంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారని కృష్ణయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీల ఆశలకు ఆశయాలకు అలాగే డిమాండ్లకు అనుగుణంగా ప్రధానమంత్రి నిర్ణయాలు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బి.సి.లు అన్ని రంగాలలో అభివృద్ధి మోడీ ద్వారానే జరుగుతుందన్నారు.బీసీలకు రిజర్వేషన్లను జనాభా గ్రూపులుగా వర్గీకరణ చేయడానికి జస్టిస్ రోహిణి అధ్యక్షతన కమిటీ నియమించారు ఆ రిపోర్ట్ ప్రకారం గ్రూపులు చేస్తున్నారు అలాగే ప్రత్యేక సంక్షేమ పథకాల రూపకల్పన, అవసరమైన బడ్జెటు కేటాయింపు, కార్యాచరణ ప్రణాళిక అమలులో ముందడుగు వంటివాటికి మార్గం సుస్పష్టం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థలలో బి.సి రిజర్వేషన్ల స్థానాలను పెంచి కేటాయించడానికి ఉపయోగపడుతుంది.
ఈ సమావేశంలో ఈ క్రింది తీర్మానాలు ఆమోదించారు :
1. పార్లమెంట్ లో బి సి బిల్లు పెట్టి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలి.
2. కేంద్రం లో బి.సి లకు ప్రతేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి 2 లక్షల కోట్లతో ప్రతేక అభివృద్ధి పథకం ప్రకటించాలి.
3. MBC లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖా కల్పించాలి.
4. స్థానిక సంస్థలలో రిజర్వేషన్లకు జనాభా ప్రకారం ఇచ్చేటట్లు రాజ్యాంగాన్ని సవరించాలి.
5. బి సి ల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను 25 శాతం నుంచి 50 శాతం పెంచాలి.
6. బి సి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి. ఈ మేరకు రాజ్యాంగాన్ని సవరించాలి.
7. బి.సి ల విద్య- ఉద్యోగ రిజర్వేషన్లు పై యున్న క్రిమిలేయర్ ను తొలగించాలి.
8. బి.సి లకు పారిశ్రామిక పాలసీ లో 50 శాతం కోటా ఇవ్వాలి.
9. హై కోర్టు – సుప్రీంకోర్టు జడ్జిల నియమాకంలో SC/ST/BC- రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలి.
10. ప్రైవేటు రంగం లో SC/ST/BC లకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలి. కేంద్రంలో ఖాలిగా యున్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి.
ఈ విలేకర్ల సమావేశంలో నీల వెంకటేష్, జిల్లపల్లి అంజి, సి.రాజేందర్, అనంతయ్య, పగిళ్ళ సతీష్, చంద్రశేఖర్ గౌడ్, రాజేష్ యాదవ్, పృద్వీ గౌడ్, అఖిల్ ముదిరాజ్, నిఖిల్, కిరణ్, ఆంజనేయులు, శ్రీను, సంజీవ్, రవి, వేణు మాధవ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.















