ఈతరం భారతం హైదరాబాద్ మార్చ్ 23:
రాష్ట్రంలో శాంతిభద్రతలు, వివిధ వర్గాల రక్షణే ధ్యేయంగా క్యాబినెట్ మూడు ముఖ్యమైన బిల్లులకు ఆమోదం తెలిపింది. సమాజంలో అశాంతిని రేకెత్తించే విద్వేషపూరిత ప్రసంగాలు మరియు నేరాల నిరోధక బిల్లును ప్రభుత్వం తీసుకురానుంది. డెలివరీ బాయ్స్ వంటి అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్లాట్‌ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల బిల్లుకు ఆమోదముద్ర వేసింది. న్యాయవాదులపై దాడులను అరికట్టేందుకు దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లును ఆమోదించింది.















