హైదరాబాద్ మార్చ్ 24 ఈతరం భారతం:
మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన కూడా పడింది. మియాపూర్, కూకట్‌పల్లి, బోరబండ, చందానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, పటాన్‌చెరు, బాచుపల్లి వంటి పలు ప్రాంతాల్లో రాళ్ల వర్షంతో కూడిన భారీ వర్షం కురిసింది.. అమీర్‌పేట్, బేగంపేట్, ఎస్‌ఆర్ నగర్, సికింద్రాబాద్, యూసుఫ్‌గూడ, మణికొండ, బోరబండ, చందానగర్ పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది. కార్యాలయాల నుండి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం పడటంతో ఐటీ కారిడార్‌తో పాటు ప్రధాన రహదారులన్నీ జలమయమై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అకస్మాత్తుగా కురిసిన ఈ భారీ వానతో రోడ్లు జలమయమై, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రానున్న 2-3 రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ యెల్లో అలర్ట్ జారీ చేసింది
.















