ఈతరం భారతం మార్చ్ 27
యాదాద్రి భువనగిరి : జిల్లా పరిధిలోని ఆలేరు మండలంలోని కొల్లూరు గ్రామంలో ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణోత్సవం జరిగింది. టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి దంపతులు, సర్పంచ్ జనగాం సుధా శ్రీపాల్ రెడ్డి దంపతులు పెళ్లి పెద్దలుగా వివరించి కళ్యాణోత్సవాన్ని జరిపించారు. గ్రామస్తులు పలువురు హాజరై కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరిగింది.














