EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఆశా వర్కర్లకు గాయాలు

ఈతరం భారతం హైదరాబాద్ మార్చ్ 28

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు తమ డిమాండ్ల సాధన కోసం ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో, ప్రభుత్వం తమ సమస్యలను గుర్తించాలని వారు ఈ నిరసన చేపట్టారు. అయితే, ఈ ఆందోళనను అడ్డుకోవడానికి పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేశారు.పోలీసుల తోపులాటలో ఆశా వర్కర్లకు గాయాలు తగిలాయి.ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గర తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన 18 వేల కనీస వేతనం కోసం ఆశా వర్కర్ల అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో పోలీసుల ఓవరాక్షన్ . అరెస్టుల పేరుతో ఆశా వర్కర్లపై  పోలీసులు  విరుచుకుపడ్డారు.

 

Related News

Select the Topic
Scroll to Top