EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఐకమత్యానికి డిజిటల్ దారి – ధాడీ బంజారా వెబ్‌సైట్ ఆవిష్కరణ

ఈతరం భారతం నిజామాబాద్ ఏప్రిల్ 6

నిజామాబాద్ వేదికగా నిర్వహించిన డాడీ బంజారాల రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. మహారాష్ట్ర, ముంబై, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి అతిథులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.రాష్ట్ర కమిటీ సమన్వయంతో నిర్వహించిన ఈ సమ్మేళనం ఐకమత్యానికి ప్రతీకగా నిలిచింది. రాబోయే రోజుల్లో పేద-ధనిక తేడా లేకుండా విద్య, వైద్యం మరియు సేవా కార్యక్రమాల్లో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా ధాడీ బంజారా అధికారిక వెబ్‌సైట్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధోన్వాన్ శ్రీనివాస్  తెలిపారు. ఈ వెబ్‌సైట్ ద్వారా సమాజానికి సంబంధించిన సమాచారం, విద్య, ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.అదే విధంగా, ఈ వెబ్‌సైట్‌లో వివాహాల కోసం ప్రత్యేక మ్యాట్రిమోనీ విభాగాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు.అలాగే, ఏఐడిబీఎస్ఎస్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టు రమేష్ , నేషనల్ మెంబర్ భట్టు రమణ , రాష్ట్ర అధ్యక్షులు భానవత్ స్వామి నాయక్  మరియు రాష్ట్ర, జాతీయ, జిల్లా నాయకులు వెబ్‌సైట్ అభివృద్ధికి పూర్తి మద్దతు ప్రకటించారు.త్వరలో జిల్లా కమిటీలను ఏర్పాటు చేసి సమాజానికి మరింత చేరువగా సేవలు అందించనున్నట్లు కమిటీ వెల్లడించింది.

Related News

Select the Topic
Scroll to Top