EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సంతానం, సంపాదన కాదు సమాజమే ముఖ్యమని సమాజం కోసం కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతి రావు పూలే

ఈతరం భారతం సంగా రెడ్డి ఏప్రిల్ 11 :

మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు సంగారెడ్డి లో ఘనంగా జరిగాయి. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పక్కన ఉన్న జ్యోతి రావు పూలే విగ్రహానికి టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య లు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సంగారెడ్డి కొత్త బస్టాండ్ సమీపంలో బిసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతి రావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ సంతానం, సంపాదన ముఖ్యం కాదు సమాజమే తనకు ముఖ్యమని మహనీయుడు జ్యోతి రావు పూలే ఈ సమాజం లోని సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నరంటే అందుకు మహాత్మా జ్యోతి రావు పూలే చేసిన కృషే కారణమని, మహిళ ల విద్య కోసం ఆయన ఎంతగానో కృషి చేశారని ఆయన ఆశయాలను మనం అందరం ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు.

కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ మహిళా విద్య కోసం మహాత్మా జ్యోతి రావు పూలే చేసిన కృషి ని ఈ సమాజం మరువదన్నారు. వింతతు పునర్వివాహాలు ప్రోత్సహించి ఆనాటి సాంఘిక దురాచారాల కు వ్యతిరేకంగా పోరాడాడన్నారు. స్వయంగా తన భార్యకు విద్యను అభ్యసించడం తో పాటు మహిళ ల కోసం ప్రత్యేక విద్యాలయం ఏర్పాటు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనితా సంతోష్, సదాశివపేట మున్సిపల్ చైర్ పర్సన్ మునిపల్లె అంజమ్మ సత్యనారాయణ, డిఆర్వో పాండు తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top