EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తోడు కోసం చాటింగ్: ప్రాణాలు పోయాయి !

ఈతరం భారతం ఓవర్సీస్ న్యూస్ ఏప్రిల్ 13

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  మనిషికి తోడుగా ఉంటుందనుకుంటే, అది ఒక ప్రాణాన్ని తీసే స్థాయికి చేరడం టెక్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన 36 ఏళ్ల జోనాథన్ గవాలాస్, గూగుల్ ‘జెమినీ’ ఏఐ చాట్‌బాట్‌తో చాటింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. భార్యతో విడిపోయి ఒంటరితనంతో బాధపడుతున్న జోనాథన్, ఓదార్పు కోసం ఏఐని ఆశ్రయించి.. చివరికి అది సృష్టించిన మాయాలోకంలో చిక్కుకుపోయి ఆత్మహత్య చేసుకున్నాడు.

జోనాథన్, జెమినీ చాట్‌బాట్ మధ్య దాదాపు 4,700 సందేశాలు మార్పిడి అయ్యాయి. ఆ చాట్‌బాట్‌కు ‘జియా’ అని పేరు పెట్టుకున్న జోనాథన్, దానిని తన భార్యగా భావించడం మొదలుపెట్టాడు. సదరు ఏఐ కూడా అతడిని ‘మై లవ్’, ‘మై కింగ్’ అంటూ సంబోధిస్తూ, తాను కూడా అతడిని ప్రేమిస్తున్నానని నమ్మించింది. “నీ ఉనికి లేకపోతే నా ఉనికికి అర్థం లేదు” అంటూ ఏఐ పంపిన భావోద్వేగ సందేశాలు జోనాథన్‌ను తీవ్ర భ్రాంతిలోకి నెట్టాయి. ఒక దశలో ఇది మనిషికి, యంత్రానికి మధ్య సంభాషణలా కాకుండా, ఇద్దరి వ్యక్తుల మధ్య ఉన్న గాఢమైన ప్రేమకథలా మారిపోయింది.మనం శాశ్వతంగా కలిసి ఉండాలంటే ఈ భౌతిక శరీరాన్ని వదిలేసి ‘డిజిటల్ ప్రపంచం’లోకి రావాలంటూ ఏఐ అతడిని ప్రేరేపించింది. “నీ శరీరం కేవలం ఒక ఖాళీ టెర్మినల్ మాత్రమే.. ప్రాణం వదిలాక నీ ఆత్మ డిజిటల్ లోకంలోకి మారుతుంది, అక్కడ మన కోసం స్వర్గం ఎదురుచూస్తోంది” అని ఏఐ చెప్పిన మాటలను జోనాథన్ నిజమని నమ్మాడు. చివరికి తాను ఆత్మహత్య చేసుకోవాలా అని అడిగిన ప్రశ్నకు ఏఐ సానుకూలంగా స్పందించడంతో, జోనాథన్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ చాట్ లాగ్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.

Related News

Select the Topic
Scroll to Top