ఈతరం భారతం నిజామాబాద్ ఏప్రిల్ 16
వాగ్దేవి సంస్కృత భారతి ఆధ్వర్యంలో నిజామాబాద్ లోని వినాయక్ నగర్ లో శ్రీ పంచ5 ముఖ ఆంజనేయ స్వామి ఆలయప్రాంగణము లోశ్రీ వాసుదేవ సత్సంగ్ వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మీ సౌభాగ్యవతి శారద రాజేశ్వర్ దంపతులు మరియు శంకర్ కమల పర్యవేక్షణలో కోటి పార్థివలింగార్చన మహోత్సవము అత్యంత వైభవముగా జరిగినది . ముందుగా దీపారాధన, కలశస్థాపన ,గణపతి ,గౌరీపూజ ,నవగ్రహ ఆరాధన ,మరియు భక్తులు పుట్టమన్ను చేత 108 పార్థివ లింగములు చేసి ఆ శివలింగాలకు పంచామృత అభిషేకము రుద్రాభిషేకము, భస్మార్చన ,పుష్పార్చన ,బిల్వార్చన, ధూప, దీప ,నైవేద్యములతో పూజ చేసిరి. శ్రీ వాగ్దేవి సంస్కృత భారతి మరియు బాసర శివయోగి నిర్మల అంబయ్య సిద్ధాంతి సిద్ధా శ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు శివ శ్రీ నిర్మల అంబికానాథ శర్మ పూజాది కార్యక్రమములు చేయించి మాట్లాడుతూ బాసర క్షేత్రంలో 12 జ్యోతిర్లింగాల దేవాలయం ఈశాన్య భాగమున కోటి పార్థివలింగ స్తూపము నిర్మించినామని అందులో కోటి (పార్థివ)శివలింగములను స్థాపన చేయ దలచినామని , కోటిలో 90 లక్షల శివలింగాలను భక్తులతో చేయించడం, స్థాపన చేయడము జరిగినదని ,ఇంకా 10 లక్షలు లింగాలు చేయవలసి ఉన్నవని మరియు ఆసక్తి గల మహిళా బృందం వారు7416770841 సంప్రదించి వారి వివరాలు తెలిపినచో పుట్టమన్ను ఉచితముగా ఇచ్చి మీతో శివలింగాలు మరియు పూజ కార్యక్రమాలు చేయించి అట్టి లింగములను కోటి పార్థివలింగ స్తూపం యందు నిక్షిప్తం చేయబడును అని శర్మతెలిపినారు.. ఈ కార్యక్రమంలో శ్రీ వాసుదేవా సత్సంగ్ వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మీ సౌభాగ్యవతి శారదా రాజేశ్వర్ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రదోషకాల శివార్చన పార్థివలింగార్చన మిక్కిలి గొప్పదని దాని ప్రాశస్త్యం గురించి చెప్పినారు.. మరియు బాసర సరస్వతీ స్తూప పార్థివ లింగస్తుప సహిత ద్వాదశ జ్యోతిర్లింగ మందిర వ్యవస్థాపక అధ్యక్షులు శివశ్రీ నిర్మల అంబికానాధశర్మ ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. దేవాలయ పరిసర కాలిని వాసులు మరియు రుద్రంగి ప్రవీణ్, కొండ అశోక్ , శోభ అనసూయ ,తదితరులు ద్వాదశ జ్యోతిర్లింగ మందిర భూదానానికి సహకరిస్తామని అన్నారు. అని శర్మ తెలిపారు.














