EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఖమ్మం 43వ డివిజన్‌లో భారీ ఉచిత వైద్య శిబిరం

ఈతరం భారతం ఖమ్మం ఏప్రిల్ 26

ఖమ్మం నగరంలోని 43వ డివిజన్‌లో యూత్ నాయకులు సంతోష్, దినేష్, దిలీప్‌ల ఆధ్వర్యంలో సాయిరాం గ్యాస్ట్రో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో భారీ ఎత్తున ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం నగర టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండాల కృష్ణ, మాజీ డిప్యూటీ మేయర్ భక్తుల మురళి ప్రసాద్, డాక్టర్ జంగాల సునీల్ కుమార్ గారు పాల్గొన్నారు. వైద్య శిబిరంలో హెల్త్ చెకప్ చేయించుకున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ, డాక్టర్ జంగాల సునీల్ కుమార్ గారు ఇంత పెద్ద స్థాయిలో హెల్త్ క్యాంపు నిర్వహించి స్థానిక ప్రజలకు ఉచిత పరీక్షలు మరియు మందులు అందించడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. ఖమ్మం నగరంలో సాయిరాం గ్యాస్ట్రో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా హైదరాబాద్ వరకు వెళ్లకుండా పేద ప్రజలకు అన్ని విధాలుగా వైద్య సేవలు అందుబాటులో ఉంచుతున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఇలాంటి హెల్త్ క్యాంపులు ఖమ్మం నగరంలోని పేద ప్రజలు నివసించే అన్ని డివిజన్లలో కూడా నిర్వహించాలని వారు కోరారు. అనంతరం డాక్టర్ జంగాల సునీల్ కుమార్ ను శాలువ తో సత్కరించారు.

 

ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కార్పొరేటర్ బుర్రి వినయ్, ఖమ్మం నగర యూత్ నాయకుడు మాటేటి కిరణ్, స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులు పిడతల రామ్మూర్తి, మోబీన్, కోడి వీరబాబు, పోలే పొంగు వెంకట్ మరియు డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top