ఈతరం భారతం హైద్రాబాద్ ఏప్రిల్ 26
అగాని కాలజ్ఞాన కర్త పురోగమి సంఘసంస్కర్త శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారి 333 ఆరాధన మహోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ నడిబొడ్డున ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో 1985లో ట్యాంక్ బండ్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి విగ్రహ ఏర్పాటు చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు పూజలు అందుకుంటున్నారు. భూతా భవిష్యత్తు వర్తమానం గురించి తెలియజేసిన వారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ తొలి శాసనసభాపతి ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి గారు బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి , విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేములవాడ మదన్మోహన్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అట్లూరి రవీంద్ర చారి శైలేంద్ర చారి, బీసీ కుల సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వలబోజు నరసింహాచారి, తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ కన్వీనర్ అనంతోజు బ్రహ్మచారి గారు, బిజెపి కార్యవర్గం మెంబర్ పూసాల బ్రహ్మచారి గారు, సంకోజు లింగాచారి, మల్లెల అనంతచారి గారు, పులిహోర, మిఠాయిలు ప్రసాద పంపిణీ చేసిన రామస్వామి గారు, రోంజ కళాకారుడు అమర్నాథ్, కాంగ్రెస్ నాయకుడు భానుమూర్తి గారు, మల్యాల కృష్ణ తండోప దండాలుగా విశ్వబ్రాహ్మణులు ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అనంతోజు బ్రహ్మచారి మాట్లాడుతు భూతా భవిష్యత్ వర్తమానం గురించి ముందే తెలియజేసిన మాహనీయుడు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు ఒక్కడేనని అన్నారు. బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలు ప్రతి గ్రామమున ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్న ప్రజలకు మన బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్రహ్మంగారి పేరు మీద ట్యాంక్ బండ్ పై కొంత స్థలాన్ని కేటాయించి ధ్యాన మందిరముగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కుందారం కోరారు. బ్రహ్మచారి మాట్లాడుతూ ఈ జాతిలో పుట్టడం జాతికే గర్వకారణం విశ్వకర్మ బ్రహ్మంగారు జయశంకర్ సార్, ఉన్న ఇలాంటి మహనీయులు పుట్టిన ఈ జాతి సమసమాజాన్ని అభివృద్ధి పరిచిన జాతి విశ్వబ్రాహ్మణ జాతి అని వలబోజు నరసింహచారి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో పూజింపబడ్డ యోగ గురువు ఆధ్యాత్మికంగా భూతా భవిష్యత్ గురించి ముందే తెలియచేసే మాననీయుడు మన జాతిలో పుట్టడం మన జాతికే గర్వకారణం అని అన్నారు .















