ఈతరం భారతం హైద్రాబాద్ ఏప్రిల్ 27 :
త్వరలో జడ్పిటిసి/ఎంపిటిసి ఎన్నికలు జరపడానికి పాత పద్దతిలో చర్యలు తీసుకోవాలని సన్నాహాలు చర్చలు చేపట్టాలని కొందరు క్యాబినెట్ మంత్రులు/కలెక్టర్లు, సంబంధిత అధికారులకు రహస్య ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానం చేసినట్లు 42 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని రాజ్యసభ సభ్యులుఅద్యక్షులు జాతీయ బీసీ సంక్షేమ సంఘంజాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
గతంలో గ్రామపంచాయతీ ఎన్నికలలో బీసీలకు 17 శాతం రిజర్వేషన్లు తగ్గించి, మున్సిపల్ ఎన్నికలలో 28 శాతం రిజర్వేషన్లు తగ్గించి అమలుచేసి బీసీలకు తీరని ద్రోహం చేశారు. అయినప్పటికీ బీసీలు తిరగబడి గ్రామపంచాయతీలలో 53 శాతం, మున్సిపాలిటీలో 68 శాతం బీసీలు గెలిచి సత్తాచాటారు. అయితే జడ్పిటిసి/ఎంపీటీసీ ఎన్నికలు పూర్తిగా పార్టీ ప్రాదికగా జరుగుతాయి. కావున ఖచ్చితంగా 42 శాతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కోర్టు “స్టే” తొలగించడానికి చర్చలు తీసుకురావాలని ఈ కేసు గెలిపించడానికి చర్యలు తీసుకోవాలి.
రాజకీయ పార్టీలు బిసిలకు 42 శాతం రిజర్వేషన్లపై చిత్తశుద్ధితో లేదు. ఏ పార్టీ బీసీల పక్షాన మాట్లాడలేదు.కాంకొందరుu పార్టీలో కొందరు నాయకులు మహేష్ గౌడ్ తో సహా హనుమంతరావు, పొన్నం ప్రభాకర్ మాత్రమే బీసీల పక్షాన గట్టిగా మాట్లాడుతున్నారన్నారన్నారు. మిగతా నాయకులు ఎవరు కూడా బీసీలకు మద్దతుగా మాట్లాడలేదు. 42 శాతం పెంచకుండా ఎన్నికలకు వెళితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కొందరు నాయకులను, మీడియాను బెదిరించి తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలని చూస్తే ఎన్నో రోజుల నడవదని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి అనేక బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. మంత్రివర్గంలో 9మంత్రులు బీసీలు ఉండాలి. కానీ ముగ్గురికి మాత్రమే ఇచ్చి అది కూడా ప్రాదాన్యత లేని శాఖలు ఇచ్చి బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. అలాగే కార్పొరేషన్ చైర్మన్ లో, సమాచార శాఖ కమిషనర్లలో బీసీలకు తీరని ద్రోహం చేశారు. కలెక్టర్ పోస్టులలో, డిప్యూటీ కలెక్టర్లు, SP, DSP, గ్రేటర్ పరిధిలో పరిసరాల ప్రాదాన్యత గల పోస్టులను బీసీలను నియమించలేదు. విద్యార్థుల స్కాలర్ షిప్, ఫీజుల బకాయిలు చెల్లించకుండా, చదువుకోకుండా అడ్డుతగులుతున్నారు. ఉద్యోగ నియమకాలలో రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయడం లేదు. బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. చివరకు బీసీ శాఖకు ఒక ఉన్నతాధికారిని బీసీని నియమించ కుండా బీసీ వ్యతిరేక వైఖరికి పెంచుకుంటున్నారు. బీసీ వైఖరికి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.















