EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఖమ్మం మున్సిపల్ కమిషనర్ కు కోర్టు వారెంట్

ఈతరం భారతం ఖమ్మం ఏప్రిల్ 28

ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ ఆగస్త్యకు హైకోర్టు వారెంట్ జారీ చేసింది. ఖమ్మం నగరంలో వెంకటగిరి గేటు తొలగింపు సమయంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్బీ) నిర్మాణానికి స్థల సేక రణ. ఇళ్లు కూలగొట్టినందుకు పరిహారంగా భూసేకరణ అదికారి(ఆర్డీఓ) నిర్ణయించిన సుమారు రూ.60 లక్షలు ప్రభుత్వం చెల్లించలేదు. పరిహారం కోసం 25 సంవత్సరాలుగా ఖమ్మం జిల్లా కోర్టు, హైకోర్టులో కేసులు దాఖలు చేసి చనిపోయిన బొగ్గా రపు రామారావు, లక్ష్మణరావు వారసులు హైకోర్టులో కోర్టు ధిక్క రణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా ఖమ్మం మున్సిపల్ కమిషనర్ శుక్రవారం కోర్టుకు హాజరు కాక పోవడం, హాజరు మినహాయింపు పిటిషన్ రిజెక్ట్ కావడంతో న్యాయమూర్తి జస్టిస్ కాజా శరత్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. మే 1న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు.

Related News

Select the Topic
Scroll to Top