ఈతరం భారతం హైదరాబాద్ ఏప్రిల్ 28
లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ముగింపు దశకు చేరుకున్నాయి. పర్యాటక శాఖలో గిరి దర్శక్ గైడ్ల పేరుతో వారికి ఉద్యోగాలు కల్పించింది. వారంతా భద్రాచలం, ములుగు జిల్లాల్లో విధులు నిర్వహించనున్నారు. అందుకోసం వారికి.. నెల రోజులపాటు తెలంగాణ స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్యూరో(ఎస్ఐబీ), పర్యాటక శాఖ సంయుక్తంగా శిక్షణ అందించాయి. ఈ శిక్షణ పూర్తి కావడంతో.. వారిని పర్యాటక శాఖలో కొలువుల్లోకి తీసుకున్నారు.
దేశవ్యాప్తంగా మావోయిస్టులు లొంగిపోయి.. జన జీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధికి పాటుపడాలని కేంద్రం పిలుపునిచ్చింది. అందుకోసం’ఆపరేషన్ కగార్’ను తెరపైకి తీసుకు వచ్చింది. లొంగిపోయిన మావోయిస్టులకు నగదుతోపాటు పునరావాసం కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం.. లొంగిపోయిన వారికి గిరి దర్శక్ గైడ్లుగా పర్యాటక శాఖలో ఉద్యోగాలు కల్పించింది.















