ఈతరం భారతం హైదరాబాద్ ఏప్రిల్ 29
తెలంగాణ సచివాలయంలో పోలీస్ యూనిఫామ్ ధరించి రీల్ చేసిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంగోలుకు చెందిన రవి (అలియాస్ నిఖిల్), వృత్తిరీత్యా వంటమనిషిగా పనిచేస్తూ, పోలీసు కావాలనే బలమైన కోరికతో ఈ దుస్సాహసానికి పాల్పడ్డాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి సచివాలయం వద్దకు వచ్చి, భద్రతా సిబ్బందిని బతిమలాడి అనుమతి పొంది లోపలికి ప్రవేశించి ఈ రీల్ చేశాడు. ఈ వ్యవహారంపై స్పందించిన అధికారులు, నిందితుడిపై చీటింగ్ కేసుతో పాటు ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.















