ఈతరం భారతం హైద్రాబాద్ ఏప్రిల్ 29
ఎబివిపి సికింద్రాబాద్ జిల్లా ప్యారడైజ్ శాఖ ఆధ్వర్యంలో ఎస్ వి ఐ టి కాలేజ్ లో తరగతుల బహిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా స్టేట్ గర్ల్స్ కన్వీనర్ కళ్యాణి గారు విద్యార్థులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా సుమారు 10,000 కోట్ల పెండింగ్‌లో ఉన్న ఫీజురీయింబర్స్‌మెంట్ మరియు స్కాలర్షిప్లను విడుదల చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని వివరించారు. ఈ పరిస్థితి పేద మరియు మధ్యతరగతి విద్యార్థుల విద్యాభవిష్యత్తును దెబ్బతీస్తుందని వారిని చదువులకు దూరం చేసే ప్రమాదం ఉందని చెప్పారు
అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు… లేనిపక్షంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడుతుందని హెచ్చరించారు…ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ చేర్క బాలకృష్ణ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగౌతమ్, ప్యారడైజ్ నగర కార్యదర్శిగోకుల్,అభినయ్, విష్ణు, పరమేష్, వికాస్ మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు















