ఈతరం భారతం హైదరాబాద్, మే 01
విద్యా రంగాన్ని భవిష్యత్ నైపుణ్యాలతో అనుసంధానించే ఒక కీలక చర్యలో భాగంగా రామయ్య యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్, రామయ్య మెడికల్ కాలేజ్, రామయ్య మెమోరియల్ హాస్పిటల్‌ను నిర్వహిస్తున్న గోకుల ఎడ్యుకేషన్ ఫౌండేషన్(మెడికల్) బెంగళూరులో రామయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్(రిస్మ్) పేరిట డీమ్డ్-టు-బి విశ్వవిద్యాలయంను ప్రారంభించడానికి, ప్రముఖ ప్రభుత్వ పరిశోధనా విశ్వవిద్యాలయమైన యూనివర్సిటీ ఎట్ అల్బనీ, స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌తో భాగస్వామ్యం చేసుకున్నట్లు గోకుల ఎడ్యుకేషన్ ఫౌండేషన్(మెడికల్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ గురుచరణ్ గొల్లెర్కేరి శుక్రవారం నగరంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూనివర్సిటీ ఎట్ అల్బనీ అధ్యక్షుడు హవిడాన్ రోడ్రిగ్జ్ తోకలసి ఆయన మాట్లాడుతూ తదుపరి తరం స్టెమ్, మేనేజ్‌మెంట్ సంస్థగా రూపుదిద్దుకున్న రిస్మ్, వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ పరిసరాలకు విద్యార్థులను సిద్ధం చేస్తూ, పరిశోధన, వాస్తవ ప్రపంచ వినియోగాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ, ప్రపంచ ప్రమాణాలతో కూడిన, పరిశ్రమలకు అనుగుణమైన విద్యను అందిస్తుందని తెలిపారు. ఈ విశ్వవిద్యాలయం తమ మొదటి విద్యా సంవత్సరాన్ని ఆగస్టు-26లో ప్రారంభించనుందని తెలిపారు.















