ఈతరం భారతం హైద్రాబాద్ మే.2:
తెలంగాణ రాష్ట్రానికి మరీముఖ్యంగా.. వరంగల్ నగరానికి ప్రత్యేక గుర్తింపును తీసుకురానున్న ‘పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు’ను గౌరవ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు.మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. తొలిసారిగా తెలంగాణ పర్యటనకు విచ్చేస్తున్న నరేంద్ర మోదీ హైదరాబాద్ నుంచి మే 10వ తేదీన వర్చువల్‌గా ఈ మెగా టెక్స్‌టైల్ పార్కును ప్రారంభిస్తారు.
అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో నిర్మించిన ఈ పార్కు.. టెక్స్‌టైల్ హబ్ గా మారనుంది. ఈ పార్కు ద్వారా వస్త్ర ఉత్పత్తి, ఎగుమతులు మరింతగా వృద్ధి చెందనున్నాయి. దీంతోపాటుగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.రూ.𝟏,𝟔𝟗𝟓.𝟓𝟒 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు ద్వారా రూ.6 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. ఇప్పటికే 𝟑,𝟖𝟎𝟎 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి.
1,327 ఎకరాల్లో విస్తరించిన ఈ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్కు. ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్ రీజియన్ అండ్ అప్పారెల్ (పీఎం మిత్ర) పథకం కింద బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా ఎంపికైంది.
‘ఫామ్ టు ఫైబర్’,
‘ఫైబర్ టు ఫ్యాక్టరీ’,
‘ఫ్యాక్టరీ టు ఫ్యాషన్’,
‘ఫ్యాషన్ టు ఫారిన్’ అనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 5F విజన్‌ను ఈ మెగా టెక్స్ టైల్ ప్రతిబింబించనుంది.















