ఈతరం భారతం కరీంనగర్ మే 3
కరీంనగర్ నగరంలో ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో జనసంచారం మొదలవుతున్న తరుణంలో ఓ ఘటన చోటుచేసుకుంది. సిబ్బంది జ్యువెలరీ షాపును తెరిచి, లాకర్లోని బంగారు ఆభరణాలను కౌంటర్లలో డిస్ప్లే పెడుతుండగా, రెండు బైకులపై వచ్చిన ఐదుగురు ముసుగు ధరించిన దుండగులు లోపలికి ప్రవేశించారు.లోపలికి రాగానే దుండగులు భయాందోళన సృష్టించేందుకు గాలిలోకి మరియు సిబ్బందిపై విచక్షణారహితంగా సుమారు 30 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో షాపులో పనిచేస్తున్న ఒక సిబ్బంది బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.ఈ సంఘటన పట్టణంలో కలకలం రేపింది.















