ఈతరం భారతం హైదరాబాద్ మే 3
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి మే 9వ తేదీ వరకు రైతు వారోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. సాగులో ఉన్న ఇబ్బందులను తొలగించి, అన్నదాతలకు అండగా నిలవడమే ఈ ఉత్సవాల ప్రధాన లక్ష్యం. అధికారులు నేరుగా గ్రామాలకే వచ్చి సమస్యలను పరిష్కరిస్తారు.ఈ ఉత్సవాల తో వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల ప్రభుత్వ సేవలు సులభంగా అందుతాయి. రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా, వారి ఇంటి వద్దకే పాలన వస్తుంది. విత్తనాలు, ఎరువులు, సాగు సలహాలు వంటి కీలక అంశాలపై అధికారులు అవగాహన కల్పిస్తారు. పారదర్శకమైన సేవలతో రైతులకు మేలు చేకూర్చడం ప్రభుత్వ ఉద్దేశ్యం.















