ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి మహేషుని లక్ష్మయ్య మే 5
హైదరాబాద్‌లో అక్రమ మైనింగ్‌పై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న స్టోన్ క్రషింగ్, ఆర్ఎంసీ యూనిట్లపై భారీ స్థాయిలో చర్యలు చేపట్టింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్, రెవెన్యూ శాఖల ఫిర్యాదులతో రంగంలోకి దిగిన హైడ్రా, ఒకే రోజు 6 ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 6 క్రషింగ్ యూనిట్లతో పాటు, 12 ఆర్ఎంసీ ప్లాంట్లను తొలగించింది. భవిషత్తులో ఆ ప్రాంతాల్లో స్టోన్ క్రషింగ్ చేయడానికి వీలు లేకుండా యంత్ర సామగ్రిని ధ్వంసం చేసింది. రూ.వందల కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందన్న సంబంధిత శాఖల ఫిర్యాదుల మేరకు పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి అక్రమ మైనింగ్కు ఫుల్‌స్టాప్ పెట్టింది.
హైడ్రా మంగళవారం భారీ ఆపరేషన్ చేపట్టింది. అనుమతులు లేకుండా మైనింగ్, క్రషింగ్, ఆర్ఎంసీ యూనిట్లను నడుపుతున్న వారిపై చర్యలకు దిగింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్ శాఖల నుంచి ఫిర్యాదు అందగానే రంగంలోకి దిగిన హైడ్రా, ఈరోజు ఉదయం ఒకేసారి 6 ప్రాంతాల్లో బుల్డోజర్లతో దాడులు చేసి అక్రమ మైనింగ్కు ఫుల్‌స్టాప్ పెట్టింది. 12 ఆర్ఎంసీ ప్లాంట్లను తొలగించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లి, శేరిలింగంపల్లి మండలంలోని గౌలిదొడ్డి, శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ ప్రాంతాల్లో ఈ దాడులు చేసింది.
ఇష్టానుసారం క్వారీలు తవ్వి, స్టోన్ క్రషింగ్‌తో దుమ్ము రేపి, పరిసరాలను నాశనం చేసే వారిపై హైడ్రా చర్యలు తీసుకుంది. విపరీతమైన దుమ్ముతో వాతావరణాన్ని కాలుష్యం చేయడాన్ని నియంత్రించింది. బండ రాళ్లను పేల్చి పరిసర ప్రాంతాల్లోని నివాసాలకు ముప్పుగా పరిణమించిన అక్రమ మైనింగ్కు ఫుల్స్టాప్ పెట్టిన హైడ్రా, 6 చోట్ల స్టోన్ క్రషింగ్ యూనిట్లను నేల కూల్చింది. భవిష్యత్తులో అక్కడ స్టోన్ క్రషింగ్ చేయడానికి వీలు లేకుండా యంత్ర సామగ్రిని తొలగించింది. గతంలో మైనింగ్, పీసీబీ శాఖల హెచ్చరికలను పట్టించుకోకుండా యథేచ్ఛగా సాగుతున్న అక్రమ మైనింగ్‌కు హైడ్రా మంగళవారం శాశ్వతంగా చెక్ పెట్టింది.
అందరూ బడాబాబులే : రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగుల పల్లి, శేరిలింగంపల్లి మండలంలోని గౌలిదొడ్డి, శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలో అక్రమ మైనింగ్‌కు పాల్పడిన వారంతా బడా సంస్థలకు చెందిన వారే కావడం గమనార్హం.














