EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రామ తత్వ ప్రచారం తోనే లోక కళ్యాణం

ఈతరం భారతం హైద్రాబాద్ మే 12 ;

రామ తత్వ ప్రచారం తోనే లోక కళ్యాణం అని రామ కథ ప్రచారకుడు మోహిత్ చరణ్ జి మహారాజ్ అన్నారు.అయోధ్యహనుమాన్ జయంతి సందర్భంగా ఖైరతాబాద్ లోని ఆంజనేయస్వామి దేవాలయంలో మాతృదేవోభవ సత్సంగ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భక్తి సంగీత కార్యక్రమంలో అయోధ్య నుంచి వచ్చిన మోహిత్ చరణ్ జి మహారాజ్ భక్తి సంగీత కార్యక్రమం ద్వారా రామ భక్తి రామ తత్వ విలువలను తెలుపుతూ ప్రపంచ శాంతికి గాని లోక కళ్యాణానికి గాని రామ తత్వమే శరణ్యమని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు ఆర్యవైశ్య సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీర బొమ్మ రమేష్ మాట్లాడుతూ ముఖ్యంగా యువతలో రామ తత్వాన్ని ప్రచారం చేయటం వల్ల చెడు అలవాట్లకు దూరమై మంచి మార్గంలో పయనించి ఉన్నతమైన మార్గంలో జీవిస్తారని తెలిపారు గౌరవ అతిథిగా విచ్చేసిన సుధాకర్ గుప్తా మాట్లాడుతూ రామ తత్వ ప్రచారం వల్ల ప్రపంచ దేశాల్లో కూడా కాంతి చేకూరుస్తుందని తెలిపారు కార్యక్రమంలో మాతృదేవోభవ సత్సంగ్ వ్యవస్థాపక అధ్యక్షులు కేబీ శ్రీధర్ రెండు రాష్ట్రాల సెక్రటరీ విజయ కనకదుర్గ వర కుమార్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top