EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రేవంత్ రెడ్డి నికార్సైన కాంగ్రెస్ లీడర్ : రాష్ట్రం లో బీజేపీ వీక్ గా ఉందన్న విషయం మోడీ కి అర్థం అయ్యింది

ఈతరం భారతం హైద్రాబాద్ మే 13 :

రేవంత్ రెడ్డి నికార్సైన కాంగ్రెస్ లీడర్ . రేవంత్ మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి .మోదీని ప్రధాన మంత్రిగా మాత్రమే చూస్తాం .బండి సంజయ్ కొడుకు కేసులో ఎలాంటి జాప్యం లేదు .పోక్సో చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ . బండి సంజయ్ కొడుకుని తప్పించే అవసరం మాకు లేదు. చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి అన్నారు టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్. గాంధీభవన్లో ఆయన విలేకరులతో చిక్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూఆ అమ్మాయి కి న్యాయంజరుగుతుంది.కాంగ్రెస్పార్టీ,ప్రభుత్వం అండగా ఉంటుంది. బండి సంజయ్ కొడుకు అప్స్కండింగ్ అయ్యాడని పోస్టర్ ఎవరు వేశారో తెలియదు..ఎవరు తీసివేశారో తెలియదు.. అన్నారు.

ప్రజలు ప్రతిపక్ష పాత్ర కేసీఆర్ కి ఇచ్చారు..కానీ ఆయన ఫామ్ హౌజ్ కి పరిమితం అయ్యారు. మునుపెన్నడు లేని విధంగా రాష్ట్రం లో పంటలు పండాయి.. అందుకే కొంత ఆలస్యం అయ్యింది… బీజేపీ కేంద్ర ప్రభుత్వం బెంగాల్ తరహాలో ఇక్కడ కూడా సెక్యులర్ ఓట్లు తొలగించాలని చూస్తున్నారు.బాధితురాలికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది మోదీ మన్మోహన్ తో కలిసి రాలేదు బీజేపీ ఎంపీలకు సోయి లేదు మోదీ ఏదో ఇస్తాడని అనుకుంటే ఏమీ ఇవ్వలేదు ప్రధాని వచ్చినప్పుడు తెలంగాణకు కావాల్సింది అడగరా తెలంగాణ ఉద్యమ కారులనుమేముగౌరవిస్తున్నాము.. మేము ప్రతిపక్ష నేతనుగౌరవిస్తున్నాము..ఆనాడు దళితుడు భట్టి ప్రతిపక్ష నేతగా ఉంటే కేసీఆర్ ఓర్చుకోలేక పోయారు..మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు రాష్ట్రం లో బీజేపీ వీక్ గా ఉందన్న విషయం మోడీ కి అర్థం అయ్యింది అందుకే తెలంగాణ కు వచ్చినట్టు మాకు అర్ధం అవుతుంది. దేశంలోకమ్యూనిస్ట్ లేరని అనుకుంటే తప్పు..ఇప్పటినే కమ్యూనిస్ట్ లు సజీవంగా ఉన్నారు.పొదుపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అని చెప్పారు.

ప్రజలు పొదుపు చేస్తారు. కేంద్ర ప్రభుత్వమే పొదుపు చేయాలి.ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను మేం అగౌరవపరచలేదు.ప్రస్తుత సీఎం రేవంత్ పై కేటీఆర్ భాష చెత్తగా ఉంది బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఇష్టమున్నట్టు మాట్లాడుతున్నారు.సంపన్నులు బంగారం కొంటారు. బీదవాళ్ళు పెళ్లి సమయంలోనే బంగారం కొంటారు అన్నారు.

కమ్యూనిస్టులు అయిపోయారు అనుకుంటే పొరపాటే.టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి తెలంగాణలో పోటీ చేసినా ఇబ్బంది లేదు. మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా ముప్పై శాతం దాటదన్నారు.మంత్రి పదవి కంటే పీసీసీ చీఫ్ గా సంతోషంగా, గర్వంగా ఉన్నానన్నారు.12 ఏండ్ల నుండి పొదుపు గురించి మోదీ ఎందుకు మాట్లాడలేదు. క్రూడ్ ఆయిల్ ధర సగం తగ్గితే పెట్రోల్ ధర సగం పెంచారు అని కామెంట్ చేశారు.

Related News

Select the Topic
Scroll to Top