ఈతరం భారతం హైదరాబాద్ మే 17
తెలుగు సినీ పరిశ్రమను మరోసారి కలవరపెడుతూ ‘ఐ బొమ్మ’ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. పైరసీ వెబ్‌సైట్ల ద్వారా కొత్త సినిమాలను అక్రమంగా విడుదల చేస్తున్నారంటూ ఫిలిం ఛాంబర్ ఆదివారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.పైరసీ వెబ్‌సైట్ల ద్వారా కొత్త సినిమాలను అక్రమంగా విడుదల చేస్తున్నారంటూ ఫిలిం ఛాంబర్ ఈరోజు (ఆదివారం) సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా ‘ఐ బొమ్మ’, ‘బప్పం టీవీ’ పేర్లతో నడుస్తున్న వెబ్‌సైట్లు తాజాగా విడుదలైన పలు సినిమాలను ఆన్‌లైన్‌లో లీక్ చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫిలిం ఛాంబర్ అధికారికంగా ఫిర్యాదు చేయగా, సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సినిమా పరిశ్రమకు భారీ నష్టం కలిగించేలా పైరసీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని సినీవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.














