ఈతరం భారతం హైదరాబాద్ మే 19:
ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితి 44 ఏళ్లకు పెంపు! తెలంగాణా ప్రభుత్వం ప్రత్యక్ష నియామకాల లో గరిష్ట వయోపరిమితిని 10 సంవత్సరాలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం ఉన్న 34 ఏళ్ల వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ సడలింపు ఒక సంవత్సరం పాటు అమల్లో ఉంటుంది.రాష్ట్రంలోని వివిధ నియామక సంస్థలు చేపట్టనున్న రానున్న నియామకాలకు ఈ నిర్ణయం వర్తించనుంది.నిరుద్యోగ యువత నుంచి వచ్చిన వినతుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఫిజికల్ స్టాండర్డ్స్ ఉన్న యూనిఫాం సర్వీసులకు ఈ సడలింపు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది.














