EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ను కలిసిన టిపిసిసి ఎలక్షన్ కమిషన్ కో-ఆర్డినేషన్ కమిటటి సభ్యులు

ఈతరం భారతం హైద్రాబాద్ మే 19 :

తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ సెక్రటరీ లింగ్య నాయక్ ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎలక్షన్ కమిషన్ కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ పులిపాటి రాజేష్ కుమార్ మరియు సభ్యులు కలవడం జరిగినది.ఇటీవల రాష్ట్ర ఎలక్షన్ కమీషనర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి చుడి బజార్ లోని ఈసీఐఎల్ ఇంజనీర్లచే ఈవీఎం లను చెకింగ్/ఎఫ్ ఎల్ సి ప్రక్రియ ప్రారంభించడం జరిగినది.

రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ మరియు కార్పొరేషన్ ఎలక్షన్ కోసంఉపయోగించునున్న ఈ M2 మోడల్ ఈవీఎం మాషింలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్‌ కార్పొరేషన్ల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బ్యాలెట్‌ ఓటింగ్‌ విధానానికే ప్రాధాన్యం ఇస్తుందని తెలపడం జరిగినది, ఒకవేళ, ఈవీఎంతో ఎన్నికలు జరిగితే, M2 మోడల్ మెషీన్లను ఉపయోగించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎందుకంటే ఈ M2 మోడల్ ఈవీఎం లకు వివిపిఏటీ ( Voter Verifiable Paper Audit Trail ) సౌకర్యం లేదు, ఓటర్లు ఇచ్చిన ఓటు సరిగ్గా వారు ఇష్టపడే అభ్యర్థికి పోయిందో తెలుసుకునే సౌకర్యం లేదు అందువలన ఎన్నికలకు బ్యాలెట్ పేపర్‌ను వినియోగించాలని కోరారు.

ఈ సమావేశంలో టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ పులిపాటి రాజేష్ కుమార్, సభ్యులు సింగిశెట్టి జగదీశ్వర్ రావు, గోపిశెట్టి రాఘవేందర్, టీ. రేవతి గౌడ్, కాసభ శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top