EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఎంసీఆర్ హెచ్ ఆర్ డీ బోధి పెవిలియన్ లో పరిశ్రమల శాఖ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

ఈతరం భారతం హైద్రాబాద్ మే 21 :

ఎన్ సి ఆర్ హెచ్ ఆర్ డి బోధి ప్రివిలియన్లో పరిశ్రమల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలోపరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు,సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి , తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ శశాంక ,పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి,ఇతర ఉన్నతాధికారులు హాజరైనారు.

కార్యక్రమంలో భారత్ ఫ్యూచర్ సిటీ లో ల్యాండ్ అలాట్మెంట్ ,పరిశ్రమల ఏర్పాటుపైన సీఎం అధికారులతో చర్చించారు.నెట్ జీరో సిటీ తరహా లోనే డిజైన్స్ ఉండాలి .మౌలిక వసతుల కల్పన అంతర్జాతీయ స్థాయిలో ఉండాలి ..ఇందులో రాజీ పడొద్దు .అంతర్జాతీయ స్థాయి నగరాలను అధ్యయనం చేయాలని సూచించారు.ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేసిన తర్వాతే భూ కేటాయింపులు చేయాలి..అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఫ్యూచర్ సిటీ కి తీసుకురావాలి..ఫ్యూచర్ సిటీ లో ప్రజా ప్రతినిధులు,సివిల్ సర్వీస్ అధికారులు,జర్నలిస్ట్ లకు 500 ఎకరాలు..కేంద్రం ప్రకటించిన హెల్త్ క్లస్టర్ ను ఫ్యూచర్ సిటీ వచ్చేలా చర్య లు తీసుకోవాలి..అవసరం అయితే ప్రధాని మోదీ ని కలిసి హెల్త్ క్లస్టర్ కేటాయించాలని విజ్ఞప్తి చేద్దా మన్నారు.జూన్ లో ఫ్యూచర్ సిటీ ఇండ్రస్టియల్ పార్క్ లో పరిశ్రమల ఏర్పాటు కు శంకుస్థాపన జరిగేలా చూడాలి.భూ కేటాయింపు జరిగిన వెంటనే పరిశ్రమలు నిర్మాణం మొదలు పెట్టేలా నిబంధన విధించాలి ..ఇన్వెస్ట్ తెలంగాణ పేరు లో పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి..ఇన్వెస్ట్ తెలంగాణ కోసం ఆకర్షణీయమైన లోగో,వెబ్ సైట్ రూపొందించాలి .. ఇన్వెస్ట్ తెలంగాణ కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలి రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టే వారి కోసం ఎస్కార్ట్ ఆఫీసర్ వ్యవస్థ ని రూపొందించాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

గ్రూప్ 1 స్థాయి అధికారిని ఎస్కార్ట్ ఆఫీసర్ గా నియమించే అంశాన్ని పరిశీలించాలి..తమిళనాడు,గుజరాత్ పారిశ్రామిక విధానాన్ని అధ్యయనం చేయాలి..బుల్లెట్ ట్రైన్ కోసం భూ సేకరణ ప్రారంభించాలి..1500 ఎకరాల్లో డేటా సిటీ ఏర్పాటు చేయాలి..డేటా సిటీ నీటి అవసరాల కోసం ఎస్ టీ పీ లను వినియోగించాలి..జీసీసీ లు, డేటా సెంటర్లు కోసం కరీంనగర్,వరంగల్,విజయవాడ రోడ్ల సమీపం లో ఉన్న ప్రభుత్వ భూములు గుర్తించాలి..ద్వితీయ శ్రేణి నగరాలల్లో జీసీసీ ఏర్పాటు పైన దృష్టి పెట్టేలా పాలసీ రూపకల్పన చేయాలి..మూడు నెలల్లో ప్రభుత్వ కార్యాలయాలు టీ ఫైబర్ కు కనెక్ట్ కావాల్సిందే…అని చెప్పారు.

Related News

Select the Topic
Scroll to Top