ఈతరం భారతం హైద్రాబాద్ మే 22 :
హైదరాబాద్ జాతీయ బి.సీ. భవన్ లో శ్రీ శ్రీ అంతర్జాతీయ కళావేదిక ఆధ్వర్యంలో 2026, జూన్ 6, 7 తేదీలలో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ వేదికగారాజమహేంద్రవరం లో జరిగే 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలు పోస్టర్ ను రాజ్యసభ సభ్యులు, బి.సి. సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ శ్రీ శ్రీ కళావేదిక 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలు విజయవంతమై మరెన్నో ప్రపంచ రికార్డులు సాధించాలని కోరుతూ తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని వివరిస్తూ కవిత్వం సమాజ ప్రయోజన కారి కావాలన్నారు.
శ్రీ శ్రీ కళావేదిక జాతీయ సమన్వయకర్త మొహమ్మద్ అబ్దుల్ రషీద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ కవుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సుతారపు వెంకట నారాయణ, శ్రీ శ్రీ కళావేదిక ప్రపంచ మహాసభలు జాతీయ కల్చరల్ వింగ్ కార్యదర్శి, సమన్వయకర్త, నంది అవార్డు గ్రహీత డా. దీపక్ న్యాతి, ప్రముఖ కవయిత్రి ప్రొఫెసర్ శోభా దేశ్పాండే, పవర్ లిఫ్టింగ్ గోల్డ్ మెడల్ గ్రహీత మరియు కవయిత్రి అయిన దొడ్ల విజయ, కొమ్ము వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.














