EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

స్వామి వివేకానంద భావజాల స్పూర్తితో బాలబాలికలు ఎదగాలి : ఏసిపి పింగిళి ప్రశాంత్ రెడ్డి

ఈతరం భారతం హైదరాబాద్ మే 23

స్వామి వివేకానంద భావజాల స్పూర్తితో ఎదిగిన బాలబాలికలు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం లాంటి మహనీయులవుతారని – ఏసిపి పింగిళి ప్రశాంత్ రెడ్డి అన్నారు.

శనివారం శ్రీరామకృష్ణ సేవా మందిరంలో నిర్వహిస్తున్న బాలసంస్కార్-2026 వేసవి శిక్షణా శిభిరం 9వ రోజు ముఖ్య అతిథిగా ఖాజీపేట ఏసిపి పింగిళి అశోక్ రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.మొదట సేవాసమితి ప్రతినిథులు కటంగూరి సత్యనారాయణ రెడ్డి, ప్రభు చైతన్య మరియు కి)యాశీల సభ్యులతో కలిసి, ఏసిపి, పింగిళి ప్రశాంత్రెడ్డి మొదట సేవా సమితి పూజా మందిరంలో మూర్తిత్రయాన్ని దర్శించుకొని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు.

తర్వాత బాలసంస్కార్ లో పాల్గొన్న బాలబాలికలను ఉద్దేశించి మాట్లాడుతూ, స్వామి వివేకానంద జీవితం యువత వెలుగు బాటకు మార్గ దర్శకమని, వారి భావజాల స్పూర్తితో ఎదిగిన బాలబాలికలు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం లాంటి మహనీయులవుతారని, మీరంతా క్రమశిక్షణ, సమయపాలన, నిజాయితీ, నైతిక విలువలు పాటించడం, నిరంతరం నేర్చుకోవాలన్న తపన, పెద్దల యెడ గౌరవం, ముఖ్యంగా జీవితంలో ఏ ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా పట్టుదలతో శ్రమిస్తే మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని, మీకు జన్మను ప్రసాదించిన తల్లి-తం డు)ల, ఆత్మీయుల మన్ననలు పొందగలుగుతారని అన్నారు.వరంగల్ వాసవి క్లబ్ సౌజన్యంతో బాలసంస్కార్ లో పాల్గొన్న దాదాపు 100 మంది బాలబాలికలకు స్వామీ వివేకానంద ‘రోజుకో సూక్తి’ పుస్తకాలను బహుకరించడం జరిగింది. సేవా సమితి సభ్యులు పేట శ్రీనివాస్, రామన్న, కె.వి.రావు, సూర్య, విష్ణు, మాతాజీలు, కె. సరోజనమ్మ, చిదర అంజనీ దేవి, పడిదల అనిత, లక్ష్మి రావు, చిర్ర సరోజన, నరేష్, శ్రీకాంత్, రఘు తదితర వాలంటీర్లు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top