EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సామాన్యుడి ప్రార్ధన : పి ఎమ్ వో స్పందన

ఈతరం భారతం హైద్రాబాద్ మే 25 :

“హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీ జీ..

ప్లీజ్..బ్యాన్ టుబాకో ప్రొడక్ట్స్ సేల్ ఎట్ స్కూల్స్ & కాలేజ్” అంటూ.. ప్రార్థించిన ఓ సామాన్యుడి మొర ను ప్రధాని కార్యాలయం ఆలకించింది. మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా,టుబాకో కంట్రోల్ హీరో అవార్డు గ్రహీత, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ పి ఎమ్ వో కు లేఖ పంపారు.దీనిపై స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం ప్రాధాన్య క్రమం లో ఈ అంశాన్ని పరిశీలించేందుకు స్వీకరిస్తున్నట్టు మాచన రఘునందన్ కు సమాచారం అందించింది.

“మాచన” హర్షం

ఒక లేఖ ను ప్రాధానమంత్రి కార్యాలయానికి పంపండం సాధారణం.కానీ అది అక్కడ అందినా..దానికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం అనేది అరుదు..అందునా.. ప్రధాని కార్యాలయ పరిశీలన లో..ఎన్నో విషయాలు ఉండగా.. టుబాకో కంట్రోల్ ఆవశ్యకత ను వివరిస్తూ..తను చేసిన సూచన ను ప్రాధాన్య క్రమం లో స్వీకరించడం, ఆ విషయాన్ని తనకు తెలియపరచడం పట్ల టుబాకో కంట్రోల్ హీరో అవార్డు గ్రహీత మాచన రఘునందన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రాధాన మంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఈ స్పందన చూస్తుంటే..

ఖచ్చితంగా..

పి ఎమ్ వో..ఓ గొప్ప నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని మాచన రఘునందన్ ఆశా భావం వ్యక్తం చేశారు. స్కూళ్లు కాలేజీల వద్ద “నో స్మోకింగ్ జోన్” లు గా ప్రకటించడం, టుబాకో కంట్రోల్ దిశ గా భారత దేశం తీసుకునే ఓ అసాధారణ నిర్ణయం గా నిలుస్తుందని రఘునందన్ అభిప్రాయపడ్డారు.

Related News

Select the Topic
Scroll to Top