ఈతరం భారతం వార్తాంశం : మధుశ్రీ నలుబోల జర్నలిస్ట్
కిడ్నీ వ్యాధితో చావు బతుకుల్లో ఉన్న కూతురుని కాపాడుకునేందుకు ఓ తల్లి వేదన
రెక్కల కష్టంతో సాగుతున్న జీవనం
గుండె తరుక్కుపోయే విషాదం భర్తను కోల్పోయి ఇద్దరు పిల్లలతో కూలి పని చేస్తూ జీవితాన్ని వెల్లదీస్తూ దుర్భర స్థితిలో ఉన్న ఓ తల్లిని విధి వెక్కిరించింది
ఖమ్మం నగరంలోని ఖానాపురం యు పి హెచ్ కాలనీలో నివసించే ఆరూరి ప్రమీల భర్త వెంకటేశ్వర్లు చనిపోవడంతో కుటుంబ భారం ఆమెపైనే పడింది కొడుకు నాగేంద్ర చారి కార్పెంటర్ పనికి ఆమె కూలి పనులకు వెళ్తూ రోజులు గడుపుతున్నారు ఒకపక్క భర్త లేని లోటు మరొకపక్క రెక్కాడితే గాని డొక్కాడని పేదరికం . వీటన్నిటికీ తోడు ఇప్పుడు కంటికి రెప్పలా పెంచుకున్న కూతురు ప్రాణాపాయ స్థితిలో కూతురు ఉమామహేశ్వరి 26 ఆరోగ్యము క్షీణించడంతో కొట్టుమిట్టాడుతోంది విధి ఆ కుటుంబం పై పగ పట్టిందా అన్నట్టుగా ఆ తల్లి కన్నీళ్లే ఆ ఇంటికి దిక్కయ్యాయి రెక్కల కష్టంతో కొనసాగుతున్న జీవనం ఎండనక వాననక కష్టపడుతూ తన రక్తాన్ని చెమటగా మారుస్తూ పిల్లలను పెంచి పెద్ద చేసింది నాకు ఏమైనా పర్వాలేదు కానీ నా పిల్లలు బాగుండాలి అని కోరుకున్న ఆ తల్లి ఆశలపై విధి కోలుకోలేని దెబ్బ తీసింది
26 ఏళ్ల కూతురికి కిడ్నీ వైఫల్యం
హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చూపించగా అక్కడ వైద్యులు అన్ని వైద్య పరీక్షలు చేయగా తన కూతురు ఉమామహేశ్వరికి రెండు కిడ్నీలు పూర్తిగా పాడయ్యాయని వైద్యులు నిర్ధారించారు సాధ్యమైనంత త్వరగా ఆపరేషన్ చేయించాలని తెలిపారు.
ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ యువతి ఇప్పుడు కదిలితే ప్రాణం పోయే స్థితిలో మంచానికే పరిమితం అయింది నిరంతరం డయాలసిస్ చేయిస్తూ కిడ్నీ మార్పిడి ట్రాన్స్ ప్లాంటేషన్ చేస్తేనే అమ్మాయి బ్రతుకుతుందని వైద్యులు చెబుతున్నారు.
సహాయం కోసం ఎదురుచూపులు
నా భర్త పోయిన పిల్లల కోసం బ్రతికానని ఇప్పుడు నా కూతురు కళ్ళముందే నరకం అనుభవిస్తుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నాను అని వైద్యం చేయించడానికి రూపాయి కూడా లేని దుర్భర స్థితిలో ఉన్నానని నా పిల్లలను కాపాడండి అంటూ ఆ తల్లి కన్నీరు మున్నీరవుతుంది 200 రూపాయల కూలి డబ్బులతో ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న ఆ కుటుంబానికి లక్షల రూపాయలతో కూడిన వైద్యం చేయించడం ఆకాశాన్ని అందుకోవడమే . రోజువారి మందులు ఖర్చులకే డబ్బులు లేక ఆ తల్లి పడుతున్న నరకయాతన వర్ణనాతీతం ప్రస్తుతం ఆ కుటుంబం అత్యంత దయనీయ స్థితిలో ఉంది మన చిన్న సహాయం ఆ కుటుంబానికి కొండంత అండ కాగలదు ఒక తల్లి కన్నీరు తుడవడానికి 26 ఏళ్ల యువతికి పునర్జన్మ ప్రసాదించడానికి మీ వంతు సహాయాన్ని అందించాల్సిందిగా ఆ తల్లి వేడుకుంటుంది. దాతలు ఎవరైనా సహాయం అందించాలనుకున్నవారు 9392133306. నెంబర్ కు ఫోన్ పే చేయగలరని దీని స్థితిలో ఆ తల్లి వేడుకుంటుంది.
………….
మానవత్వమే నీస్వరూపం నీ చిన్న సహాయం ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది
…………..














