EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రాజకీయ భిక్ష పెట్టిన సింగరేణిని తగలబెడతారా?

ఈతరం భారతం హైద్రాబాద్ మే 27 :

తెలంగాణలో సింగరేణిని కన్నతల్లిగా, భూతల్లిగా పూజిస్తాం. బొగ్గుగనిలోకి వెళ్లేముందు కార్మికులు నమస్కరించి అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్తారు. దక్షిణ భారతానికే జీవనాడి అయిన కోల్ బెల్ట్ ప్రాంతాన్ని, సింగరేణి హెడ్‌క్వార్టర్స్‌ను, ఆఫీసులను తగలబెట్టాలని బీఆర్ ఎస్ నాయకుడు బాల్కన్ సమన్ పేర్కొనడాన్ని బిజెపి ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ తీవ్రంగా తప్పుబట్టారు బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అస్యన మాస్ట్లడుతూ సింగరేణి హెడ్‌క్వార్టర్స్‌ను, ఆఫీసులను తగలబెట్టాలని పిలుపునివ్వడానికి బాల్క సుమన్‌కు సిగ్గుండాలి.హైదరాబాద్ నుంచి వచ్చిన బాల్క సుమన్‌ను కోల్ బెల్ట్ కార్మికులు అక్కున చేర్చుకుని ఎంపీగా గెలిపించారు, అసెంబ్లీలో కూర్చోబెట్టారు. మీకు రాజకీయ భిక్ష పెట్టిన సింగరేణిని, మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన కార్మికవర్గాన్ని తగలబెడతారా? ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఇంతలా బరితెగించి మాట్లాడుతాడా?

నమ్మి నానబెడితే పుచ్చిబుర్రలైనట్లుగా….. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి తీసుకొస్తే.. పది కొత్త బొగ్గు గనులు తెరిచి 30 వేల మందికి కొత్త ఉద్యోగాలిస్తమని, ‘మన పోరగాళ్లకు నౌకర్లిస్తాం’ అని నాడు కేసీఆర్ ఘంటాపథంగా చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ సింగరేణిని పూర్తిగా నాశనం చేసిందని దుయ్యబట్టారు.టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేనాటికి 76 వేల మంది కార్మికులుంటే.. దిగిపోయే సమయానికి ఆ సంఖ్యను 32 వేలకే పరిమితం చేశారు. 40 వేల మంది కార్మికులకు తీరని అన్యాయం చేశారు.శ్రీరాంపూర్‌లో 11 బొగ్గు గనులకు కేవలం శిలాఫలకాలు వేశారు తప్ప ఒక్క కొత్త గని కూడా తెరవలేదు. పైగా 17 ఓపెన్ కాస్ట్‌లు తెచ్చి కార్మికుల సంఖ్యను తగ్గించి ఊడబీకారన్నారు.

రాత్రి పగలనక కష్టపడి కార్మికులు సంస్థను లాభాల బాట పట్టిస్తే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 50 వేల కోట్ల బకాయిలు పెట్టి ముంచింది. ఆ డబ్బు ఇప్పటికీ వాపస్ ఇవ్వలేదు. దాంతో నేడు కార్మికులకు ఓవర్ డ్రాఫ్ట్ (OD) ద్వారా జీతాలిచ్చే దారుణ పరిస్థితి దాపురించింది. కేసీఆర్ నాయకత్వంలో సింగరేణి బొందలగడ్డగా మారిందని విమర్శించారు.బాల్క సుమన్.. నాడు సెంటిమెంట్ అన్నడు.. నేడు మిలిటెంట్ అంటూ మాట్లాడుతున్నడు.. ఈ వ్యవహారమంతా వసూళ్ల కోసమేనా? ఆనాడు ఉద్యమ పార్టీగా మొదలై, అధికారంలోకి వచ్చాక దోచుకుని, ఇప్పుడు అధికారం కోల్పోయేసరికి బీఆర్ఎస్ నేతల్లో అసహనం పెరిగిపోయింది. నాడు తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకున్నారు.. ఇప్పుడు మిలిటెంట్ అంటూ హింసను ప్రేరేపిస్తున్నారు.

కార్మికులు మిమ్మల్ని ఓడగొట్టారు కాబట్టి, ఇప్పుడు డబ్బులు రాబట్టడానికి సింగరేణి ఆఫీసులను కాలబెట్టి, బ్లాక్‌మెయిల్ చేసి వసూళ్లు చేయాలని చూస్తున్నారా? బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో రూ. 900 కోట్లు ఉన్నాయని మీరే ప్రకటించారుగా.. ఆ డబ్బులు ఖర్చు చేసుకోండి. అంతే కానీ సింగరేణిని, బీజేపీ నేతలను బద్నాం చేయడం సబబు కాదు.బాల్క సుమన్.. మీ అధినాయకుడు కేసీఆర్ మాట్లాడిస్తేనే మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? తెలంగాణ ప్రజలు ఏనాడూ హింసను భరించరు, గౌరవించరు. ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకుని బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించండి.. హింసాత్మక వైఖరితో వెళ్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు.ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సంస్థ పట్ల, సింగరేణి కార్మికుల పట్ల గత బీఆర్ఎస్ తరహాలోనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వసూళ్ల కార్యక్రమాల వల్లే సింగరేణి సంస్థ ఆర్థికంగా కుప్పకూలుతోందన్నారు.

Related News

Select the Topic
Scroll to Top