ఈతరం భారతం హైదరాబాద్ మే 27
బోయిన్పల్లి అంబేడ్కర్ నగర్లో అంబులెన్స్‌కు దారి లేకపోవడంతో గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్న పోచయ్య(60) ప్రాణాలు కోల్పోయాడు. రహదారిపై ఇరువైపుల వాహనాలు నిలిపివేయడంతో గంటసేపు అంబులెన్స్ అక్కడే చిక్కుకుపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటనపై ఆగ్రహంతో స్థానికులు రోడ్డుపై ధర్నా చేయగా తిరుమలగిరి పోలీసులు వారిని చెదరగొట్టి కేసు నమోదు చేశారు. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేపింది.
𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦👇 :
https://t.me/KesaboBeherabyLiveNewsUpdate














