EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సురవరం ప్రతాపరెడ్డి గారి రచనలు నేటి తరాలకు మార్గదర్శకాలు : తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వి. నిత్యానందరావు

ఈతరం భారతం హైదరాబాద్ మే 28

తెలుగు జాతి గర్వకారణమైన మహనీయుడు, తెలంగాణ వైతాళికుడు, ప్రజాహిత చింతకుడు సురవరం ప్రతాపరెడ్డి గారి విగ్రహాన్ని తెలుగు విశ్వవిద్యాలయం బాచుపల్లి ప్రాంగణంలో ఘనంగా ఆవిష్కరించడం విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణకు, తెలంగాణ చరిత్ర పరిశోధనకు, సామాజిక చైతన్యానికి తన జీవితాన్నే అంకితం చేసిన సురవరం ప్రతాపరెడ్డి గారి సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి. చిన్నారెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని సురవరం ప్రతాపరెడ్డి గారి కృషిని కొనియాడారు. తెలంగాణ సమాజ చరిత్రను వెలికితీసి, భాషా సాహిత్యాలకు విశిష్ట సేవలందించిన మహోన్నత వ్యక్తిత్వంగా ఆయనను అభివర్ణించారు. తెలంగాణ ఆత్మను అక్షరరూపంలో నిలబెట్టిన మహనీయుల్లో సురవరం ప్రతాపరెడ్డి గారు అగ్రగణ్యులని పేర్కొన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వి. నిత్యానందరావు గారు మాట్లాడుతూ, సురవరం ప్రతాపరెడ్డి గారి రచనలు నేటి తరాలకు మార్గదర్శకాలని తెలిపారు. తెలంగాణ భాష, సంస్కృతి, చరిత్రలపై ఆయన చేసిన పరిశోధనలు చిరస్మరణీయమని అన్నారు. విద్యార్థులు, పరిశోధకులు ఆయన రచనలను అధ్యయనం చేసి సమాజ చైతన్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు గారు మాట్లాడుతూ, సురవరం ప్రతాపరెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ తెలుగు విశ్వవిద్యాలయానికి గర్వకారణమని తెలిపారు. తెలంగాణ చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయునికి ఇది నిజమైన నివాళి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, సాహితీవేత్తలు, పరిశోధకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సురవరం ప్రతాపరెడ్డి గారి సేవలను స్మరించుకున్నారు. సభలో తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక వైభవం ప్రతిఫలించింది.

Related News

Select the Topic
Scroll to Top